ETV Bharat / state

వచ్చేనెలలోనే చెత్తతో విద్యుత్ తయారీ ప్రారంభం - జీహెచ్​ఎంసీ కమిషనర్​

చెత్త నుంచి విద్యుత్ తయారీకి గ్రేటర్ హైదరాబాద్ సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో ప్లాంట్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్​ఎంసీ ప్రకటించింది. దీని సామర్థ్యం 30 మెగా వాట్లు ఉంటుందని కమిషనర్​ దానకిషోర్​ తెలిపారు.

దానకిషోర్​
author img

By

Published : May 3, 2019, 10:04 PM IST

హైదరాబాద్ జవహర్ నగర్​లో మున్సిప‌ల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్​ను నెల రోజుల్లో ప్రారంభించనున్నట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ తెలిపారు. దీని సామర్థ్యం 30 మెగా వాట్లుగా ఉంటుందని వివరించారు. పాట్నా మున్సిపల్​ కార్పొరేషన్​​కు చెందిన 15 మంది కార్పొరేటర్లు, అధికారులు గ్రేటర్​ హైదరాబాద్​ను సందర్శించి మేయర్​ బొంతు రామ్మోహన్​, కమిషనర్​లతో విడివిడిగా సమావేశమయ్యారు.

కొద్దిరోజుల్లో చెత్త నుంచి విద్యుత్​ తయారీ

ఇతర కార్పొరేషన్లకు ఆదర్శం

కోటికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో పారిశుద్ధ్యం నిర్వహణ అత్యంత క్లిష్టమైనా... సాంకేతిక సాయంతో దానిని అధిగమించామని మేయర్​ బొంతు రామ్మోహన్​ అన్నారు. స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణలో జీహెచ్​ఎంసీ దేశంలోనే ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రజలను సైతం ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం మరో మూడు నెలల్లో 25 వేల మందిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, వ్యూహాత్మక ర‌హ‌దారుల కార్యక్రమం, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహ‌ణ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌కు బాండ్ల రూపేణ నిధుల సేక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌ను మేయ‌ర్ రామ్మోహ‌న్ వారికి వివ‌రించారు.

ఇదీ చదవండి : 'నిమ్స్​లో దీక్షను విరమించిన లక్ష్మణ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.