ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కొన్ని ఆస్పత్రుల తీరు మారడం లేదు. తాజాగా సికింద్రాబాద్‌లోని ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్లిన వేణుగోపాల్ అనూహ్యంగా మృతి చెందటంతో ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.
వేణుగోపాల్ మృతి చెంది 3 రోజులు అవుతున్నా తమకి చెప్పలేదని.. 2 లక్షల రూపాయలు కట్టించుకుని కొవిడ్‌తో చనిపోయారని సమాచారం ఇచ్చారని బంధువులు వాపోతున్నారు.
మిగిలిన లక్షన్నర రూపాయలు కట్టి... మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ ఆస్పత్రి యాజమాన్యం వాగ్వాదానికి దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: రేపిస్టుపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు