ETV Bharat / state

3 గంటల ప్రయాణానికి.. 2 రోజులు ఎదురుచూపులు - హైదరాబాద్​ తాజా వార్తలు

లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో ఉపాధి లేక ఊరుబాట పడుతున్న వలస కార్మికులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఆరేడు గంటల్లో గమ్యస్థానం పోవాల్సింది.. రోజుల తరబడి ప్రయాణించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​, ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ స్టేషన్లలో ఆకలితో పడిగాపులు కాస్తున్నారు.

Passengers waiting for trains from two days at Secendrabad
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో ప్రయాణికుల ఎదురుచూపులు
author img

By

Published : May 14, 2021, 7:09 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో ఉపాధి లేక ఊరుబాట పడుతున్న వలస కార్మికులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఆరేడు గంటల్లో గమ్యస్థానం పోవాల్సింది.. రోజుల తరబడి ప్రయాణించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. రైలు ఏ సమయానికి ఉన్నా.. లాక్‌డౌన్‌తో ఇంటిల్లిపాదీ ఉదయం 10 గంటలలోపే రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. ఆరుబయట ఎండలో పిల్లాపాపలతో.. బండెడు సామానుతో.. ఆకలితో ఎదురుచూడాల్సి వస్తోంది. తాగునీరు కూడా దొరకడం లేదని పలువురు ప్రయాణికులు వాపోయారు. మరోవైపు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ స్టేషన్లలో మరుసటి రోజు బస్సు ప్రయాణానికి ముందు రోజు నుంచే పడిగాపులు కాయాల్సి వస్తోంది.

పరిమితంగానే అనుమతి..

Passengers waiting for trains from two days at Secendrabad
సామగ్రితో సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వస్తున్న బాలుడు

స్టేషన్లో రద్దీ ఎక్కువైతే.. కరోనా ముప్పు ఉంటుందని భావించిన రైల్వే అధికారులు రైలు వచ్చే సమయానికి గతంలో గంట ముందు అనుమతించేవారు.. ఇప్పుడు రెండు గంటల వరకూ పెంచారు. లాక్‌డౌన్‌ పొడిగిస్తారేమో అనే భయంతో వలస కూలీలు సొంతూరు బాట పడుతున్నారు. వీరంతా ఉదయం 10 గంటలలోపు స్టేషన్‌కు చేరుకుని బయటే ఎదురు చూస్తున్నారు. హోటళ్లన్నీ మూతపడ్డాయి. తెచ్చుకున్న అల్పాహారం అయిపోయింది. రేపంతా ప్రయాణం చేయాలి.. ఆకలితో పిల్లలు అలమటిస్తున్నారని వాపోయారు. ఇదే పరిస్థితి దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌, హజ్రత్‌ నిజాముద్దీన్‌, రాజధాని, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైల్వే ప్రయాణికులది కూడా.

రేపటి బస్సుకోసం నేటి నుంచే..

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లలో వలస కూలీలు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్‌ నుంచి వచ్చిన ఓ కుటుంబం ఉదయం 10 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. వారు అచ్చంపేట వెళ్లాల్సి ఉంది. ఈ రోజు 10 గంటలకు ఇక్కడకు చేరుకున్న వెంటనే బస్సుంటే మధ్యాహ్నానికి ఇంటికి చేరేవారం. కాని లాక్‌డౌన్‌తో మరి బస్సులు లేవు. శుక్రవారం తెల్లవారు జామున బయలుదేరే బస్సు కోసం ఎదురు చూస్తున్నామని సదరు కుటుంబసభ్యుడు యాదగిరి చెప్పారు. నిజామాబాద్‌, యాదాద్రి, ఆదిలాబాద్‌, సిద్ధిపేట జిల్లాల్లో ఉన్న వలస కార్మికులు హైదరాబాద్‌ వరకూ వచ్చి మరుసటి రోజు తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇలా దాదాపు 800 మంది వలస కార్మికులు బస్సుస్టేషన్లకు చేరువలో ఉన్న చెట్లకింద, మెట్రో స్టేషన్‌ కింద ఎదురు చూస్తున్నారు.

స్టేషన్‌ నుంచి ఇంటికి చేరేదెలా..?

ఒక్కో రైలు నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్లో 500ల మంది వరకూ దిగుతున్నారు. వీరంతా లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి చేరాలంటే కుదరడంలేదు. రైలు టిక్కెట్‌ చూపెడితే ఆటోలు, క్యాబ్‌లను అనుమతిస్తున్నారు. ప్రయాణికులను దించేసి.. తిరిగొచ్చేటప్పుడు ఆటోలకు, క్యాబ్‌లకు అవస్థలు తప్పడంలేదు. మరోవైపు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి మాదాపూర్‌ వెళ్లేందుకు రూ.వెయ్యి వరకూ ఆటోవాలాలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు.

కర్నూలు పోవాలి ఎలాగో అర్థం కావట్లేదు: వీరేష్‌

వీరేష్‌, కర్నూల్​ జిల్లా

యాదగిరి గుట్టలో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాం. లాక్‌డౌన్‌తో పని ఆపేశారు. దీంతో మలోని మా ఊరు వెళ్లాలి. ఉదయం గుట్ట నుంచి బయలుదేరి వచ్చాం.. ఇక్కడకు వచ్చేసరికి 10 గంటలు అయిపోయింది. ఇప్పుడు మహబూబ్‌నగర్‌వైపు బస్సులు ఉండవని చెప్పారు. దీంతో రేపటివరకూ ఇక్కడే పిల్లాపాపలతో ఉండాలి. కనీసం భోజనం కూడా దొరకని పరిస్థితి.

అచ్చంపేట నుంచి మిర్యాలగూడకు రెండు రోజులు: రమాదేవి

రమాదేవి, మిర్యాలగూడ

అచ్చంపేట నుంచి ఎంజీబీఎస్‌కు చేరుకుని.. తిరిగి మిర్యాలగూడ వెళ్లాల్సి ఉంది. 9 గంటల లోపే చేరుకోవచ్చని అచ్చంపేటలో బయలుదేరాను. తిరా ఎంజీబీఎస్‌కు వచ్చేసరికి 10 గంటలైపోయింది. రేపే బస్సు అంటున్నారు. చేసేది లేక పిల్లలతో ఇక్కడే ఉండాల్సి వచ్చింది. నాలా చాలామంది ఇక్కడ చెట్ల నీడలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది.

ఇదీ చదవండి: సూర్య సినిమా రికార్డు.. టాప్-3లో చోటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.