ETV Bharat / state

Parties Using Helicopters in Telangana Election Campaign : ఎన్నికల్లో విస్తృతమవుతున్న హెలికాప్టర్ల వినియోగం.. ప్రధాన పార్టీలన్నీ తెగ వాడేస్తున్నాయిగా..

Parties Using Helicopters in Telangana Election Campaign : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో వివిధ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా సుడిగాలి పర్యటనల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ రెండేసి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 1:52 PM IST

Parties Using Helicopters in Telangana Election Campaign 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం (Election Campaign) ఊపందుకుంది. అధికార పార్టీ బీఆర్ఎస్‌తో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ఈసారి వేగంగా, విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. ఇప్పటికే ఆరింటిని వాడుతుండగా.. ప్రచార పర్వం చివరి అంకానికి చేరేసరికి మరో నాలుగైదు జతయ్యే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఐదింటిని వినియోగించారు. అప్పట్లో ఎన్నికల సమయాల్లో సీఎంలు, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే వాడేవారు. ఈసారి మంత్రులు, ముఖ్య నాయకులు సైతం హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్ రెండింటిని రెండు నెలల పాటు అద్దెకు తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ప్రచార అవసరాలకు అనుగుణంగా రెండేసి అద్దెకు తీసుకుంటున్నాయి.

2014, 2018 ఎన్నికల్లో 100కి పైగా కేసీఆర్‌ సభలు : కేసీఆర్‌ (KCR) తెలంగాణ ఉద్యమ సమయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. 2014, 2018 ఎన్నికల సమయాల్లో ఆయన ఇలా 100కి పైగా ప్రాంతాల్లో సభలకు హాజరయ్యారు. ఈసారీ అదే పంథాను అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడు రోజుల్లో ఐదు నియోజకవర్గాల్లో పర్యటించారు. మరోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులు కూడా హెలికాప్టర్ల ద్వారా సభలకు హాజరవుతున్నారు.

Telangana Assembly Elections 2023 : ఇతర మంత్రులు, ముఖ్య నాయకులు సైతం ప్రచారంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ (BRS) ఈ సౌకర్యం కల్పించింది. నోటిఫికేషన్‌ తర్వాత ఇంకొకటి వినియోగించే అవకాశం ఉంది. షెడ్యూల్ వెలువడిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. వారికి బీజేపీ (BJP) హెలికాప్టర్లను సమకూర్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కాంగ్రెస్‌ నేతలూ హెలికాప్టర్లను వాడుతున్నారు.

సింగిల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ ధర గంటకు రూ.1.5 లక్షల పైనే : తెలంగాణలో హెలికాప్టర్లను అద్దెకు ఇచ్చే పేరొందిన సంస్థలు లేకపోవడంతో.. రాజకీయ పార్టీలు బెంగళూరు, ముంబయి, దిల్లీలోని సంస్థలను సంప్రదించి అద్దెకు తీసుకుంటున్నాయి. గంటకు సింగిల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ ధర రూ.1.5 లక్షల నుంచి మొదలవుతుంది. అదే డబుల్‌ ఇంజిన్‌ది అయితే గంటకు రూ.2.75 లక్షలు. రోజువారీ అద్దె ప్రాతిపదికన కావాలంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు రూ.10 లక్షలు. అద్దె ధరలు ప్రియమైనా ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో పార్టీలు ఖర్చుకు వెనకాడడం లేదు.

సీఈసీ అనుమతి ఉండాల్సిందే : ఎన్నికల సమయంలో హెలికాప్టర్ల వినియోగానికి సీఈసీ అనుమతి తీసుకోవాలి. అద్దెకు ఇచ్చే సంస్థ, పైలట్‌ల వివరాలు తదితర సమాచారాన్ని వారికి అందజేయాలి. అద్దెకు ఇచ్చే సంస్థలు లైసెన్స్‌ పొందినవై ఉండాలి. పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) అనుమతి పొందాలి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో... రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.. అనుమతి సమాచారాన్ని హెలికాప్టర్‌ బయలుదేరే ప్రాంతం నుంచి దిగే ప్రాంతం జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్‌కు, ఎస్పీ/కమిషనర్‌కు చెబుతారు.

Telangana Election Campaign 2023 : ఆ ప్రకారం హెలికాప్టర్ టేకాఫ్‌, ల్యాండింగ్‌ కోసం పోలీసు యంత్రాంగం హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేస్తుంది. హెలికాప్టర్‌ బయలుదేరే సమయంలో దానికి ఇంధనం పూర్తిగా ఉందా లేదా తనిఖీ చేశాకే అనుమతి లభిస్తుంది. ఇందులో పైలట్‌ గాక ఐదుగురు ప్రయాణించే వీలుంటుంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు డబుల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్లనే విధిగా వాడాలి.

ఖర్చు పార్టీ/అభ్యర్థి ఖాతాలోనే : హెలికాప్టర్‌ వినియోగానికి పార్టీల అధ్యక్షులు, కేంద్ర మంత్రులతో పాటు.. ఈసీ గుర్తించిన స్టార్‌ క్యాంపెయినర్‌లకే అనుమతి ఉంటుంది. అవసరం మేరకు ఈ జాబితాను రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పిస్తుంటాయి. హెలికాప్టర్‌ ఛార్జీలను కూడా ఈసీ పర్యవేక్షిస్తుంది. ఏదైనా నియోజకవర్గంలో అభ్యర్థి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే దాని ఖర్చును పార్టీనే భరించాలి. అభ్యర్థి పేరు మీద ప్రచారం నిర్వహిస్తే, పార్టీ, అభ్యర్థి ఖర్చులను విభజించుకుంటారు. కేంద్ర మంత్రులు, సీఎంలు ప్రైవేట్ హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని వినియోగించాలి. ప్రధానికి మాత్రం వాయుసేన సమకూరుస్తుంది.

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారాలు.. ఇంటింటికి వెళ్తూ.. ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు

BRS Assembly Elections Campaign 2023 : ప్రచారంలో స్పీడ్ పెంచిన కారు.. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న అభ్యర్థులు, నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.