ETV Bharat / state

'పార్లమెంట్​ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి' - ఎన్నికల కమిషనర్​ దానకిషోర్​

పార్లమెంట్​ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్​ తెలిపారు. నియోజకవర్గాల వారీగా సిబ్బందికి తుది విడత శిక్షణ నిర్వహించారు.

లెక్కింపు ప్రక్రియ
author img

By

Published : May 22, 2019, 4:11 PM IST

సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా హైదరాబాద్​లోని ముఫకంజ ఇంజినీరింగ్​ కళాశాలలో సిబ్బందికి తుది విడత శిక్షణ నిర్వహించారు. మాక్​ కౌంటింగ్​పై పూర్తి స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి కౌంటింగ్​ కేంద్రం వద్ద ప్రథమ చికిత్స సామగ్రి, అంబులెన్స్​ను అందుబాటులో ఉంచుతామని దానకిషోర్​ పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా లెక్కింపు ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపుపై శిబ్బందికి శిక్షణ... ఏర్పాట్లు పూర్తి

ఇదీ చూడండి : ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పారదర్శకమే: రజత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.