ETV Bharat / state

గ్రేటర్​ పోరు: ఎన్నికల ప్రచారంలో స్థానికులతో ఎర్రబెల్లి ముచ్చట్లు

author img

By

Published : Nov 21, 2020, 4:50 PM IST

గ్రేటర్‌ కార్పొరేషన్‌కు జరుగుతున్నఎన్నికల్లో తెరాస అభ్యర్ధుల గెలుపు కోసం పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం మీర్‌పేట్‌ హౌసింగ్‌బోర్డు కాలనీలో పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారాన్ని చేపట్టారు. అందరిని కలిసి... తెరాసను గెలిపించాలని అభ్యర్థించారు.

Panchayati Raj Minister Errabelli Dayakar Rao GHMC election campaign in Mirpet

హైదరాబాద్​ కాప్రా సర్కిల్​ మీర్​పేట్​ హౌసింగ్​ బోర్డు కాలనీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రచారం నిర్వహించారు. ఆయా కాలనీల్లో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశాలు నిర్వహించిన మంత్రి... బస్తీల్లో చాయ్​ హోటల్స్​ వద్ద జనంతో కలిసి టీ తాగారు.

రోడ్ల పక్కన ఇస్త్రీ చేసుకునే వారు, చిరు వ్యాపారులు, రోడ్డున వెళ్తున్న ప్రయాణికులు, మహిళలను కలిసి తెరాస పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. కారు గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు.

జీహెచ్ఎంసీలో తెరాస అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ... ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇతర రెగ్యులర్ ఎన్నికల్లాగా అషామాషీగా తీసుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. ఛాలెంజ్​గా తీసుకుని.. ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కకుండా చేయాలని సూచించారు.

మీర్​పేట డివిజన్ రాజీవ్ గాంధీ నగర్, కైలాస గిరి, నవోదయ నగర్ మురికి వాడల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలతో కలిసి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారాలను సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.