ETV Bharat / state

మిషన్‌భగీరథ నీటిసరఫరాపై అనవసర రాద్ధాంతం తగదు: ఎర్రబెల్లి - అనుమల నీటిసరఫరా అంతరాయంపై మంత్రి ఎర్రబెల్లి

నల్గొండ జిల్లా అనుములలో మరమ్మతుల వల్ల నీటిసరఫరాకు జరిగిన అంతరాయంపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ సంఘటనపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు.

panchayat-raj-minister-errabelli-dayakar-rao-responded-on-water-supply-interruption-at-anumula-in-nalgonda-district
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
author img

By

Published : Feb 15, 2021, 6:34 PM IST

తన స్వగ్రామమైన అనుములలో మిషన్ భగీరథ నీరు రావడం లేదని రెండు రోజుల క్రితం జానారెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. దీనిపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. మరమ్మతుల కారణంగా నీటిసరఫరాలో జరిగిన అంతరాయం జరిగిందే తప్పా.. అసలు నీటి సరఫరా జరగడం లేదన్నది అవాస్తవమన్నారు. ఈ విషయాన్ని అంతగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎర్రబెల్లి విమర్శించారు.

అనుముల గ్రామానికి మిషన్ భగీరథ మంచినీరు వందకు వందశాతం సరఫరా అవుతోందని స్పష్టం చేశారు. అనుములలో జానారెడ్డి ఇల్లు ఉందా...? అమ్ముకున్నారా...? అనేది వారికి సంబంధించిన విషయమని తెలిపారు. గ్రామానికి మంచినీటి సరఫరా జరుగుతుందా... లేదా అన్నదే ప్రభుత్వ పని అని మంత్రి స్పష్టం చేశారు.

రెండు రోజుల క్రితం ప్రధాన రహదారి వద్ద జరుగుతున్న మరమ్మతుల పనుల కారణంగా మిషన్‌భగీరథ నీటిసరఫరాలో అంతరాయం ఏర్పడిన నిజమేనని ఎర్రబెల్లి తెలిపారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి నీటిసరఫరాను పునరుద్ధరించారన్న ఆయన... మున్సిపల్ ఛైర్ పర్సన్ పార్వతమ్మ ఈ విషయాన్ని లాగ్ షీట్ లోనూ లిఖితపూర్వకంగా పేర్కొన్నారని వివరించారు. నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు, మ‌ర‌మ్మతులు రావ‌డం సాధార‌ణ‌మే అన్న ఎర్రబెల్లి... ప్రతి విషయాన్ని రాద్ధాతం చేయాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. సీనియర్ నేత, అనుభవజ్ఞులైన జానారెడ్డికి ఇంతకంటే చెప్పాల్సిందేమీ లేదని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.