అభివృద్ధే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని హైదరాబాద్ పద్మారావు నగర్ తెరాస పార్టీ ఇంఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు. చిదానందం కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. విద్యారంగంలో ఎంతో అనుభవం ఉన్న సురభి వాణీదేవిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెుదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించేలాని కోరారు.
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పవన్ కుమార్ అన్నారు. వాణిదేవిని గెలిపిస్తే సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని పట్టభద్రులకు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో డాక్టర్ మూర్తి, అమర్నాథ్, మహేశ్, రాజు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఇంటర్ బోర్డు ముట్టడికి భాజపా యువ మోర్చా యత్నం