ఓయూలో ఘనంగా యూత్ పార్లమెంట్ - Ou Mock youth Parliament latest news
71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు లీడర్ షిప్ క్వాలిటీ కోసం యూత్ పార్లమెంట్ నిర్వహించారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ వీసీ ఆచార్య. రామచంద్రం ప్రారంభించారు. నేడు పార్లమెంటులో రూపుదిద్దుకుంటున్న బిల్లులపై చర్చలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా విద్యార్థులు యూత్ పార్లమెంటును నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.