ETV Bharat / state

డిగ్రీ చివరి సెమిస్టర్​ ఫలితాలు విడుదల.. 67.23 శాతం ఉత్తీర్ణత

author img

By

Published : Nov 16, 2020, 7:46 PM IST

డిగ్రీ చివరి సెమిస్టర్​ పరీక్షల ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. ఈ చివరి సెమిస్టర్​లో మొత్తం 67.23 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ చివరి సెమిస్టర్​కు 69 వేల 809 మంది హాజరు కాగా.. 46 వేల 935 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 75.34 శాతం.. బాలురు 57.67 శాతం మంది పాసైనట్లు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.

డిగ్రీ చివరి సెమిస్టర్​ ఫలితాలు విడుదల.. 67.23 శాతం ఉత్తీర్ణత
డిగ్రీ చివరి సెమిస్టర్​ ఫలితాలు విడుదల.. 67.23 శాతం ఉత్తీర్ణత

డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వెల్లడించింది. డిగ్రీ చివరి సెమిస్టర్​లో 67.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరోనా ప్రత్యేక జాగ్రత్తలతో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 18 వరకు డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ చివరి సెమిస్టర్​కు 69 వేల 809 మంది హాజరు కాగా.. 46 వేల 935 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 75.34 శాతం.. బాలురు 57.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బీఎస్సీలో 24 వేల 797 మంది హాజరవగా.. 16 వేల 758 మంది, బీకాంలో 37 వేల 140 మంది హాజరు కాగా.. 23 వేల 339 మంది ఉత్తీర్ణత సాధించారు.

బీఏ చివరి సెమిస్టర్ పరీక్షలను 4 వేల 856 మంది రాయగా.. 4 వేల 304 మంది, బీబీఏలో 3 వేల 7 మంది రాయగా.. 2 వేల 534 మంది పాసైనట్లు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.

ఇదీ చదవండి: వెటర్నరీ డాక్టర్​కు ఆల్​ ఇండియా తొలి ర్యాంక్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.