Telugu Medical students Stuck in Manali floods : విహార యాత్రకు వెళ్లి హిమచల్ వరదల్లో చిక్కుకున్న ఉస్మానియ మెడికల్ విద్యార్థులు క్షేమంగా ఉన్నట్లు అక్కడకి అధికారులు తెలిపారు. ఈ మేరకు మనాలిలో అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా మంత్రికి సమాచారం ఇచ్చారు. మంత్రి ప్రత్యేక చొరవతో విద్యార్థుల ఆచూకీ తెలుసుకున్న అధికారులు వారిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది జరిగింది: ఇటీవల ఉస్మానియాలో పీజీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన మెడికోలు.. డిగ్రీ పట్టా అందుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో స్నేహితులందరూ సరదాగా గడపాలని గత నెల 28న సిమ్లా, మనాలి ట్రిప్ వెళ్లినట్టు సమాచారం. ఉస్మానియాలో పీజీ చేసిన డాక్టర్ రోహిత్, డాక్టర్ కమల్, డాక్టర్ శ్రీనివాస్‌లు మరో ఇద్దరు స్నేహితులు నిశాంత్, గోపితో కలిసి పర్యటనకు వెళ్లారు. ఈ నెల 10న వారు నగరానికి తిరిగిరావాల్సిన ఉంది. అయితే 8వ తేదీన మనాలిలో ఉన్నామని.. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉందని స్నేహితులకు సమాచారం ఇచ్చారు.
- వరద గుప్పిట్లో హిమాచల్.. 17 మంది మృతి.. రూ.3వేల కోట్ల నష్టం.. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
- భారీ వర్షాలకు ఆరుగురు బలి.. 15కి.మీ ట్రాఫిక్ జామ్.. రోడ్డుపైనే టూరిస్టుల అవస్థలు
తాము బసచేస్తున్న హోటల్ చుట్టుపక్కల ఇళ్లు కూలిపోతున్నాయని.. సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నట్లు స్నేహితులకు ఫోన్లో వివరించారు. ఆ తరువాత ఐదుగురి విద్యార్థుల ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన మిత్రులు.. దిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించారు. దీనిపై సమాచారం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు.. వారి ఆచూకీ కోసం అక్కడి అధికారులకు ఆదేశించారు. వారిని సురక్షితంగా తీసుకురావాలని అధికారులను కోరారు. దీంతో అధికారులు అక్కడి అధికారులను సంప్రదించి డాక్టర్ల ఆచూకీ కనుగొన్నారు.
Himachal Pradesh Floods : మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలను వరదలు వణికిస్తున్నాయి. గత మూడు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. ఒక్క హిమచల్ ప్రదేశ్‌లోనే సుమారు రూ.780కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వర్షాల దాటికి అనేక జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు దెబ్బతిని జన జీవనం పూర్తిగా స్తంభించింది. కొండ చరియలు విరిగి అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి.
ముఖ్యంగా టూరిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక బస్సులు వరదల్లో కొట్టుకుపోయాయి. తాగు నీరు, సరైనా ఆహారం లేక పర్యటకులు నానావస్థలు పడుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. వారికి స్థానిక పోలీసులు సహాయం చేస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ మళ్లీ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో అధికారులు ముందుగా జాగ్రత్త పడుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచి వారికి తాగునీరు, ఆహారం అందిస్తున్నారు.
ఇవీ చదవండి: