ప్రజల్లో అవగాహన పెరిగి ఇటీవల చాలా మంది తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. కొంతమందిలో నెలకొన్న అనుమానాలను పోగొట్టేందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తన తండ్రి పేరిట ఏర్పాటైన జయచంద్రారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. అవయవ దానంపై అపోహలన్నీ తొలగిపోయాయంటున్న దాతలు జయచంద్రారెడ్డి ట్రస్టు నిర్వాహకులను అభినందిస్తున్నారు.
ఆపదలో ఉన్న వారికి అవయవదానం దివ్యౌషధంలా పని చేస్తుంది. కృత్రిమ అవయవాలను అమర్చే సాంకేతికత ఇంకా అందుబాటులోకి రాలేదు. మరింత మంది అవయవదానానికి ముందుకురావాలి. చనిపోయాక కళ్లు, ఇతర శరీరభాగాలు మట్టిపాలు కాకుండా ఇతరులకు ఉపయోగపడేలా చేయొచ్చు. -వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు దెబ్బ తగిలి మెదడు పని తీరు పూర్తిగా ఆగిపోతే అది బ్రెయిన్‌డెడ్‌గా నిర్థారిస్తారు. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అపుడు బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారి బంధువులతో జీవన్‌దాన్ బృందం సభ్యులు కలిసి మాట్లాడి వారిని అవయవదానానికి ఒప్పిస్తారు. ఏటా వేలాది మంది అవయవాలు దొరక్క మరణిస్తున్నారు. అవయవాలు కావాల్సిన వారికంటే వాటిని దానం చేసే వారి సంఖ్య చాలా తక్కువ ఉండటమే కారణమని వైద్యులంటున్నారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, పేగులు, చర్మం, ఎముకలు, నరాలు అవయవ మార్పిడికి ఉపయోగించవచ్చని వైద్యులు వివరిస్తున్నారు.
ఇవీ చదవండి: