ETV Bharat / state

యూనియన్‌ బ్యాంక్​ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభం - తెలంగాణ రాష్ట్రం వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలు రిబ్బన్‌ కటింగ్‌ ద్వారా బ్యాంక్​ జనరల్‌ మేనేజర్‌ కారె భాస్కర్‌రావు ప్రారంభించారు. యూనియన్‌ బ్యాంక్​ ఆఫ్‌ ఇండియా దేశంలో ఐదవ అతి పెద్ద బ్యాంక్​గా, నాలుగవ అతిపెద్ద బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌గా అవతరించినట్లు బ్యాంక్​ జనరల్‌ మేనేజర్‌ తెలిపారు.

opening of regional offices of union bank of india
యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభం
author img

By

Published : Jul 2, 2020, 1:10 PM IST

యూనియన్‌ బ్యాంక్​ ఆఫ్‌ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ప్రాంతీయ కార్యాలయాలతోపాటు దేశ వ్యాప్తంగా 125 ప్రారంభించినట్లు ఆ బ్యాంక్​ జనరల్‌ మేనేజర్‌ కారె భాస్కర్‌రావు తెలిపారు. తెలంగాణ జోన్‌ పరిధిలో ఇప్పుడున్న ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలతోపాటు కొత్తగా ఖమ్మంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

యూనియన్‌ బ్యాంక్​ ఆఫ్‌ ఇండియా దేశంలో ఐదవ అతి పెద్ద బ్యాంకుగా, నాల్గవ అతిపెద్ద బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌గా అవతరించినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా 9,500లకు పైగా బ్రాంచులు, 13,500లకుపైగా ఏటీఎంలు తమ బ్యాంకు కలిగి ఉన్నట్లు తెలిపారు. కేంద్ర కార్యాలయం ముంబయిలోనే కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్​ మేనేజింగ్‌ డైరెక్టర్లు, కార్యనిర్వహక సంచాలకులు, జోనల్‌ ప్రతినిధులు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు, తదితరులు హాజరయ్యారు.

ఇదీ చూడండీ : సుప్రీంకోర్టులో మంత్రి కేటీఆర్‌ కేవియట్‌ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.