పలువురు యువ కళాకారులు తమ నృత్య అభినయంతో వీక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. చక్కటి హావభావాలతో, విన్యాసాలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న వర్చువల్ యూత్ డ్యాన్స్ ఫెస్టివల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్లో పలువురు కళాకారులు భారతీయ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. పదో రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, కథక్, పేరిణి శివతాండవం లాంటి నృత్యాలను ప్రదర్శించి అలరించారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ డాన్స్ ఫెస్టివల్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్ రజతోత్సవ శుభాకాంక్షలు