ETV Bharat / state

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆన్​లైన్ తరగతులు

author img

By

Published : Sep 11, 2020, 8:00 PM IST

2019-2020 విద్యా సంవత్సరానికి దూర విద్యా కేంద్రం ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులను నిర్వహించనున్నట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలిపింది. మరిన్ని వివరాలకు వెబ్​సైట్​ను సందర్శించాలని సూచించింది.

online-classes-in-potti-sreeramulu-telugu-university
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆన్​లైన్ తరగతులు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం ద్వారా... ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తోంది. 2019-20 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు... ఇది వరకే ప్రవేశాలు పొందిన వారికి... మే, జూన్ (2020) నెలల్లో వర్శిటీ ఆవరణలో తరగతులు నిర్వహించాల్సి ఉంది.

కొవిడ్ కారణంగా ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు దూర విద్యా కేంద్ర సంచాలకులు సి.మురళీ కృష్ణ తెలిపారు. విద్యార్థులు www.teluguuniversity.ac.in వెబ్​సైట్​ను సందర్శించి వివరాలు పొందుపరచవచ్చని తెలిపారు. విద్యార్థులందరూ ఆన్ లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: నవంబర్ ​1న టీజీసెట్ ప్రవేశ పరీక్ష : కన్వీనర్ ప్రవీణ్ కుమార్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.