ETV Bharat / state

ధర పెరిగింది.. బిల్లు భారమైంది..

రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల పేరు చెప్పగానే నోరూరించే ఆహార పదార్థాలు గుర్తుకొస్తాయి. ఇప్పటివరకు మీరు ఆర్డర్​ చేసిన వంటకానికే బిల్లు చెల్లించే వారు. కానీ ఇప్పుడు...వాటితో పాటు అందించే ఆనియన్​ సలాడ్​కు ప్రత్యేక బిల్లు వసూలు చేస్తున్నారు. ఉల్లి రేట్లు పెరగడం వల్ల కొన్ని రెస్టారెంట్లు, చిన్న తరహా ఫుడ్​ కోర్టులు, ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్లలో అసలు ఉల్లిని ఆహారంతో అందించడమే లేదు.

onion-price-effect-on-food-business-in-telangana
ధర పెరిగింది.. బిల్లు పడింది
author img

By

Published : Dec 10, 2019, 7:30 PM IST

ధర పెరిగింది.. బిల్లు భారమైంది..

హైదరాబాద్ పేరుచెప్పగానే వెంటనే గుర్తొచ్చేది బిర్యానీ. నోరూరించే బిర్యానీతో పాటు ఆనియన్ సలాడ్​ను రెస్టారెంట్లు ఉచితంగా ఇస్తుంటాయి. ఐతే ఉల్లి ధర పెరగడం వల్ల ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లు, దీనికోసం ప్రత్యేకంగా ఛార్జీని వసూలు చేస్తున్నాయి. పెద్దపెద్ద రెస్టారెంట్లు మాత్రం ఎప్పటిలానే ఉచితంగా ఉల్లిని అందిస్తున్నాయి.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో....

నగరంలో యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. వీటిలో ఫ్రైడ్ రైస్, మంచురియా, నూడుల్స్ లాంటి వాటితో ఉల్లిని ఇంతకుముందు ఉచితంగా అందించేవారు. అయితే ఇప్పుడు ఫ్రైడ్ రైస్, నూడుల్స్​తోపాటు ఉల్లిని ఇవ్వటం కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మానేశాయి. ఉల్లి రేటు పెరిగినప్పటికీ... ఆహార పదార్థం రేట్లు పెంచటానికి ఉండదని... అందువల్లనే ఉల్లినివ్వటం మానేశామని ఆ ఫాస్టఫుడ్ సెంటర్ల ఓనర్లు చెబుతున్నారు.

అప్పుడు రూ.400.. ఇప్పుడు రూ.2000

రోజుకు 20 కిలోల ఉల్లి అవసరం ఉంటుందని ఓ ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్ యజమాని తెలిపారు. ధరలు పెరగకముందు రూ.350 నుంచి రూ.400 ఖర్చు చేస్తే ఇప్పుడు రూ.2000లకు పైగా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆహారపదార్థాలతో పాటు ఉల్లిని ఇవ్వడం లేదని చెప్పారు.

టిఫిన్ సెంటర్లలో

చిన్న చిన్న టిఫిన్ సెంటర్లలో దోశ లాంటి వాటిలో ఉల్లిని ఎక్కువ మోతాదులో వేయాల్సి ఉండగా... తక్కువగా వేస్తూ భోజన ప్రియులకు అందిస్తున్నారు నిర్వాహకులు.

ధర పెరిగినా.. డిమాండ్​ తగ్గలేదు

నగరంలో నెల రోజుల నుంచి ఉల్లి ధరల పెరిగాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.80 నుంచి 170 వరకు ఉంది. వీటిని కొనలేని పరిస్థితి ఉందని సామాన్యులు చెబుతున్నారు. ఒకప్పుడు మార్కెట్​కు వచ్చి 5 కిలోలు కొనే వాళ్లమని.. ఇప్పుడు కేవలం కిలో మాత్రమే తీసుకెళ్తున్నామని వినియోగదారులు అంటున్నారు. ప్రతి వంటకంలో ఉల్లి తప్పనిసరి అని అందుకే ధర ఎక్కువున్నా కొనుగోలు చేస్తున్నామని కొందరు తెలిపారు.

Intro:Body:TG_HYD_14_12_ATTN_ETVBHARAT_Onion_PRICE_effect_on_fastfood_hotels_Tiffin_centers_7202041

రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల పేరు చెప్పగానే నోరూరించే ఆహార పదార్థాలు గుర్తుకొస్తాయి. వీటిలో ఉల్లిని తప్పుకుండా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఉల్లి రేట్లు పెరగటంతో వీటి యాజమాన్యాలు రూటు మార్చాయి. కొన్ని రెస్టారెంట్లు ఉల్లికి ప్రత్యేకంగా బిల్లు వసూలు చేస్తున్నాయి. చిన్న తరహా ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఉల్లిని ఆహారంతో పాటు అందించటం లేదు.

పెరిగిన ఉల్లి ధరల...

నగరంలో నెల రోజుల నుంచి ఉల్లి ధరల పెరిగాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.80 నుంచి 170 వరకు ఉంది. వీటిని కొనలేని పరిస్థితి ఉందని సామాన్యులు చెబుతున్నారు. ఒకప్పుడు మార్కెట్ కు వచ్చి 5 కిలోలు కొనే వాళ్లమని.. ఇప్పుడు కేవలం కిలో మాత్రమే తీసుకెళ్తున్నామని వినియోగదారులు అంటున్నారు. ప్రతి దాంట్లో ఉల్లి కావాలి తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నామని మరికొందరు తెలిపారు.

పాస్ట్ ఫుడ్ సెంటర్లలో....

నగరంలో యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. వీటిలో ఫ్రైడ్ రైస్, మంచురియా, న్యూడిల్స్ లాంటి వాటితో ఉల్లిని ఇంతకుముందు ఉచితంగా అందించేవారు. అయితే ఇప్పుడు ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్ తో పాటు ఉల్లిని ఇవ్వటం కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మానేశాయి. ఉల్లి రేటు పెరిగినప్పటికీ... ఆహార పదార్థం రేట్లు పెంచటానికి ఉండదని... అందువల్లనే ఉల్లినివ్వటం మానేశామని ఆ ఫాస్టఫుడ్ సెంటర్ల ఓనర్లు చెబుతున్నారు. మంచురియాలో తప్పనిసరిగా ఉల్లిని వాడాల్సి ఉంటుందని వారు అంటున్నారు.

మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రోజుకు 20 కిలోల ఉల్లి అవసరం ఉంటుంది. ధరలు పెరగకముందు దీనికోసం రూ.350 నుంచి 400 వరకు ఖర్చు చేసే వాళ్లం. ఇప్పుడు దీనికోసం రూ. 2000లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో కొన్ని ఆహార పదార్థాలతో పాటు ఉల్లిని ఇవ్వటం లేదు - ఓ ఫాస్ట్ ఫుడ్ యజమాని.

రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు..

హైదరాబాద్ పెరుచెప్పగానే వెంటనే గుర్తొచ్చేది బిర్యానీ. దీనితో పాటు ఆనియన్ సలాడ్ ను రెస్టారెంట్లు ఉచితంగా ఇస్తుంటాయి. అయితే ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లు, దీనికోసం ప్రత్యేకంగా ఛార్జీని వసూలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లు మాత్రం ఎప్పటిలానే ఉచితంగా ఉల్లిని అందిస్తున్నాయి. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లలో దోశ లాంటి వాటిలో ఉల్లిని ఎక్కువ మోతాదులో వేయాల్సి ఉండగా... తక్కువగా వేస్తూ భోజన ప్రియులకు అందిస్తున్నారు నిర్వాహకులు.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.