కొవిడ్ వైద్య చికిత్సలపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పడకల లభ్యత, ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజుల వసూలు సహా తదితర అంశాలపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. సర్కార్ తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరిస్తున్నారు.
న్యాయస్థానం దృష్టికి..
ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితిని అమికస్ క్యూరీ న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వైద్య చికిత్సలు సక్రమంగా అందట్లేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో వాదనలు కొనసాగుతున్నాయి.
హైకోర్టు అసంతృప్తి..
రాష్ట్ర ప్రభుత్వ కొవిడ్ నియంత్రణ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేదని మొన్న అఫిడవిట్‌లో పేర్కొన్న సర్కార్.. ఇప్పుడు ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నోడల్ అధికారులే చెబుతున్నారని న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని ఆక్షేపించింది.
ఇవీ చూడండి : పర్యావరణంపై ప్రేమతో.. 'పేపర్ మాస్క్'