ETV Bharat / state

Harassments on Elders: వృద్ధులపై వేధింపులు... ఆస్తి కోసం తగాదాలు

రెక్కల కష్టం చేతగాని సమయంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు, కుటుంబసభ్యులు... వృద్ధులను, వయసు పైబడిన వారిని(OLD AGE PEOPLE) సరిగా చూసుకోకుండా అక్కడక్కడా వేధింపులకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ(TELANGANA GOVENMENT) వయోవృద్ధ సహాయ కేంద్రానికి (ఎల్డర్‌లైన్‌-14567) వస్తున్న ఫిర్యాదులే ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

Harassments on Elders
వృద్ధులపై అకృత్యాలు
author img

By

Published : Oct 1, 2021, 8:43 AM IST

వృద్ధుల సంక్షేమాని(Welfare of the elderly)కి, సంరక్షణకు ప్రత్యేక చట్టాలు చేసినా ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. వారికి చాలా కుటుంబాల్లో తగిన గౌరవ మర్యాదలు లభించడం లేదు. ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చివరకు చంపేందుకు వెనుకాడకపోవటం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్నా కనీసం మందులిచ్చేవారు కనిపించడం లేదు. కట్టుకున్న వ్యక్తి మంచానపడి ఇబ్బందులు పడుతున్నా... సహాయం చేసేందుకు చేతిలో డబ్బులేక కొందరు కుమిలిపోతున్నారు. చూసేవారెవరూ లేకపోవడంతో ఒంటరితనంతో మానసిక వేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వృద్ధులపై(HARASSMENT ON OLD AGE PEOPLE IN TELANGANA) కొనసాగుతున్న వేధింపులు ఎక్కువయ్యాయి. పైగా లాక్​డౌన్​ సమయంలో వారిపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. 2020 సెప్టెంబరు 30 నుంచి దాదాపు ఏడాది కాలంలో సహాయం చేయాలని కోరుతూ 46,771 కాల్స్‌ వచ్చాయి. తీవ్రమైన అంశాలుగా భావించి 7,715 ఫిర్యాదులను రిజిస్టర్‌ చేశారు.

కేసుల వివరాలు

కుటుంబ సభ్యులపై ఆధారపడే వారు పట్టణాల్లో అధికం

అక్టోబరు ఒకటో తేదీని అంతర్జాతీయ వృద్ధుల రోజుగా(International Day of Older Persons) పాటిస్తున్నారు. ఆధునిక వైద్యసేవలు, జీవన ప్రమాణాలు పెరగడంతో మనుషుల ఆయుష్షు పెరుగుతోంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 31 శాతం మంది, పట్టణాల్లో 61 శాతం మంది 60 ఏళ్లు దాటిన తరువాత జీవనం కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని కొద్ది రోజుల క్రితం కేంద్రం విడుదల చేసిన వయోవృద్ధుల నివేదిక (Elderly report) వెల్లడిస్తోంది.

తొలుత గృహ హింస కేసు పెట్టినా...

వయోవృద్ధుల సంక్షేమం (Welfare of the elderly) కోసం కేంద్రం చట్టం తెచ్చింది. తల్లిదండ్రుల సంరక్షణకు పెద్దపీట వేసింది. అందులో పోషణ భద్రత కల్పించినప్పటికీ చాలామంది వినియోగించుకోవడం లేదు. వయోవృద్ధ సంక్షేమాధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చినప్పటికీ పిల్లలు, కుటుంబసభ్యుల్లో మార్పులేకుంటే ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేందుకు అవకాశముంది. తొలుత గృహహింస కేసు పెడుతున్న వారిలో కొందరు.. పిల్లలు ఇబ్బందులు పడతారని తర్వాత కేసు ఉపసంహరించుకుంటున్నారు.

కేసులు-వివరాలు

వనపర్తి జిల్లాకు చెందిన వృద్ధుడు.. తన కుమారుడు సరిగా చూడటం లేదని, తరచూ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అధికారులు తొలుత కౌన్సెలింగ్‌ ఇచ్చినా ప్రవర్తనలో మార్పురాలేదు. పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రహించిన అధికారులు ఆర్డీవో ఆధ్వర్యంలోని మెయింటెనెన్స్‌ ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. తండ్రి, కొడుకు ఇద్దరికీ ఆయన కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, పడే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.

ఇదీ చూడండి: కంచెలో చిక్కుకున్న వృద్ధుడు... మూడు రోజులుగా అక్కడే...

కుమారులు చూసుకోవడం లేదని వృద్ధుడు దీక్ష

భూ సమస్యపై మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్యాయత్నం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.