ప్రముఖ ఇంటిరియల్ డిజైనర్ విజయ అల్లూరి 'తథాస్తు-ఫర్ ఆల్ లివింగ్ సొల్యూషన్స్' పేరిట ఏర్పాటు చేసిన ఇంటిరియల్ డిజైన్ స్టోర్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
ఇంటిని అందంగా కట్టుకోవడమే కాకుండా ఇంటి లోపల, బయట ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇంటిరియల్ డిజైన్‌పై నగర వాసులకు మక్కువ పెరిగిందని మహమూద్ అలీ అన్నారు. వన్ స్టాప్ సొల్యూషన్‌గా తథాస్తు ఇంటిరియల్ డిజైన్ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు ఇంటిరియల్ డిజైనర్ విజయ అల్లూరి అన్నారు. ఈ కార్యక్రమంలో మహమూద్ అలీతో పాటు రాజకీయ నాయకులు, ఇంటిరియల్ డిజైనర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మె: పట్టు వీడ లేదు.. మెట్టు దిగ లేదు..?