రాష్ట్రంలో మరో క్రిమిసంహారక మందుపై ప్రభుత్వం నిషేధం విధించింది. మెసర్స్ బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్‌కు చెందిన పీఎల్‌ఏడీబీ 19037 బ్యాచ్ నంబర్ కలిగిన... ఆల్ఫా నాప్థైల్ ఎసిటిక్ ఆసిడ్‌ను నిషేధించారు.
ఛండీనగర్ వృద్ధి, నియంత్రిక ప్రాంతీయ పురుగు మందుల పరీక్షా కేంద్రం దీనిని నాసిరకం బ్రాండ్‌గా గుర్తించింది. ఆ బ్యాచ్‌కు చెందిన ఆల్ఫా నాప్థైల్ ఎసిటిక్ ఆసిడ్ (4.5 ఎస్‌ఎల్) మందును ఎక్కడా నిల్వ చేయకూడదని... ఎరువుల దుకాణాల్లో సైతం అమ్మకూడదని సంస్థ తెలిపింది. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ క్రిమిసంహారక మందు వినియోగానికి దూరంగా ఉండాలని... వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి: విస్తరిస్తోన్న మహమ్మారి.. పల్లెల్లోనే 86 శాతానికిపైగా కొవిడ్