కొవిడ్ దృష్ట్యా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన మూడోదశను కేంద్రం ప్రారంభించిందని భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అంత్యోదయ అన్నయోజన, ఇతర లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ నెలకు ఐదు కిలోల బియ్యం చొప్పున ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు.
మే, జూన్ నెలలకు జాతీయ ఆహార భద్రత చట్టం కేటాయింపులకు అదనంగా కేంద్ర ప్రభుత్వ కోటా నుంచి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నార్తులు, వలస కార్మికుల కోసం సహాయ శిబిరాలు నిర్వహించే సేవా, స్వచ్ఛంద సంస్థలకు బహిరంగమార్కెట్ ద్వారా తక్కువ ధరకే ఆహారధాన్యాలు అందిస్తున్నట్లు అశ్వినీకుమార్ వివరించారు. రేషన్ పోర్టబిలిటీ కోసం కేంద్ర తీసుకొచ్చిన ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.