ETV Bharat / state

Internal conflicts in BJP: తెలంగాణ భాజపాలో అంతర్గత విభేదాలు.. మరోసారి బహిర్గతం!

భారతీయ జనతాపార్టీ తెలంగాణశాఖలో అంతర్గత విభేదాలు మరోసారిబయటపడ్డాయి. భాజపా జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు పేరాల శేఖరరావు... తనను బలిపశువును చేశారంటూ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంఘ్‌ పరివార్ పెద్దలకు బహిరంగ లేఖ రాశారు.

once-again-erupted-internal-conflicts-in-state-bjp

author img

By

Published : Oct 8, 2021, 5:07 PM IST

భాజపాలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. తనను బలిపశువును చేశారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సంఘ్‌పరివార్ పెద్దలకు పార్టీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు బహిరంగ లేఖ రాశారు. లింగోజిగూడ డివిజన్‌ ఏకగ్రీవం కోసం ప్రగతిభవన్ వెళ్లినప్పుడు ఏం జరిగిందో లేఖలో వివరించారు. గతంలో వ్యక్తిగత ఆర్థిక రాజకీయ స్వార్థ వ్యవహారాలు, అంతర్గత అవినీతిపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. పార్టీలో టీం స్పిరిట్ కొరవడిందని అన్నారు. వ్యక్తిగతంగా లేదా సమావేశాల్లో స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు.

సంఘ్‌పెద్దలు, మంత్రి శ్రీనివాస్ బలంతో కిషన్‌ రెడ్డికి బండి సంజయ్ క్లీన్‌చిట్‌ ఇచ్చారని తెలిపారు. ఆగమేఘాల మీద కిషన్‌రెడ్డికి రక్షణ కవచంగా నిల్చిన సంఘ్‌ పెద్దలకు, బండి సంజయ్‌కి తానూ ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. కనీసం ఫోన్‌లో లేదా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడలేదని వాపోయారు. స్వార్థం కోసం తానెప్పుడూ లోపాయికారీ వ్యవహారాలు చేయలేదని స్పష్టంచేశారు. తాను పార్టీకి నష్టం కలిగించేలా ఏమైనా ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: Harish Rao: ఓటేసే ముందు ఇంట్లో గ్యాస్​ సిలిండర్​కు దండం పెట్టి వెళ్లండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.