నీటి వృథాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఇంకుడు గుంత ఆధునికీకరణ పనులు ప్రారంభించారు.
సహజ వనరులను పరిరక్షించి రేపటి తరానికి అందిద్దామని మంత్రి విజ్ఞప్తి చేశారు. మిషన్ కాకతీయ, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్బ జలాలు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ప్రజలు నీటి వృథాను అరికట్టాలని కోరారు. వర్షపునీరు భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నల్లాలు బిగించి నీరు వృథాగా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, సీజీఎం ప్రభు, కార్పొరేటర్ కోలన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు