ఇటీవల వరంగల్ జిల్లా ఖాజీపేట్కు చెందిన బ్రాహ్మచారి అనే వ్యక్తి ఓ మహిళపై చేసిన లైంగిక దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని... ఎల్బీనగర్కు చెందిన ఆళ్లగడ్డ ప్రసాద్, ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన మార్నేని రాజు స్పష్టం చేశారు. కానీ ఈ విషయంలో కొంతమంది తమపై తప్పుడు ప్రచారం చేయడాన్ని వారు ఖండించారు.
గతంలో సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చొరవతో... నేర జీవితానికి స్వస్తి పలికి తాము మరికొంతమంది ప్రజా జీవితంలోకి రావడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే పోలీసు అధికారులు తమ సొంత డబ్బులతో టీ స్టాల్ పెట్టించారని దానితో కుంటుంబాన్ని పోషిస్తున్నామని తెలిపారు. అప్పటి నుంచి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రజా జీవితంలో కొనసాగుతున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ