వైద్య రంగ పరికరాల ఉత్పత్తుల కోసం కృషి చేస్తున్న అంకుర సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.పారిశ్రామికవేత్తలను ఒక్కచోట చేర్చేందుకు రూపొందిన ఓజస్ మెడ్ టెక్ బయో నెస్ట్ని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. హైదరాబాద్ త్రిపుల్ ఐటీలో ఇంక్యుబేటర్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం, బీఐఆర్ ఏసీ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
మరో కలికితురాయి...
మందులు, వ్యాక్సిన్ల తయారీలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు ఓజస్ మెడ్ టెక్ బయో నెస్ట్ మరో కలికితురాయి వంటిదని జయేష్ రంజన్ పేర్కొన్నారు.ప్రారంభించిన రోజే దాదాపు ఎనిమిది అంకుర సంస్థలు బయోనెస్ట్లో తమ ఉత్పత్తులు ప్రదర్శించి ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి:ఆదిత్య కిరణం... ఆరోగ్యం పదిలం...