METRO gates closed: పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌కు భాజపా శ్రేణులు తరలిరావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా గేట్లు మూసివేశారు. స్టేషన్లో తొక్కిసలాట జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టారు. భాజపా విజయ సంకల్ప సభ ముగియగానే భాజపా శ్రేణులు ఒక్కసారి స్టేషన్‌కు పోటెత్తడంతో కాసేపు నీరిక్షించాల్సి వచ్చింది. దీంతో అధికారులు గేట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మెట్రో స్టేషన్‌కు ఒకేసారి వేలాది మంది రావడం.. అప్పటికే టిక్కెట్ కౌంటర్లు, ఫ్లాట్ ఫాంపై జనం రద్దీగా ఉండటంతో ప్రయాణికులను అదుపు చేసేందుకు అధికారులు శ్రమించాల్సి వచ్చింది. గేట్లు మూసేసిన మెట్రో సిబ్బంది క్రమ క్రమంగా ప్రయాణికులను లోపలికి అనుమతించారు. అంతకుముందు సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రధాని భద్రతా దృష్ట్యా ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్, జేబీఎస్ స్టేషన్లను మూసేశారు. సభ ముగిశాకే తిరిగి తెరిచారు.
ఇవీ చదవండి: 'తెలంగాణ అభివృద్ధే మా ప్రాధాన్యత.. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుంది..'
టీచర్‌తో స్టూడెంట్ అఫైర్.. అలా చేయమన్నందుకు రాడ్‌తో కొట్టి!