ETV Bharat / state

కృష్ణమ్మ పరవళ్లు... ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత - water inflow

ఎగువ ప్రాంతాల నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

కృష్ణమ్మ పరవళ్లు... ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
author img

By

Published : Aug 13, 2019, 11:24 AM IST

ఎగువ నుంచి ఉరకలేసుకుంటూ కృష్ణమ్మ తరలి వస్తోంది. నీరు బ్యారేజీ వద్దకు భారీగా చేరుతోంది. ప్రవాహం పెరిగినందున విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ కిందికి ప్రవహిస్తోంది. బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం 10 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరదనీరు ఇంకాపెరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ తరుణంలో పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని నిలుపుదల చేశారు.

అధికారుల అప్రమత్తం

ఏపీ ప్రకాశం జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌, సంయుక్త కలెక్టరు మాధవీలత ఎప్పటికప్పుడు నీటి ప్రవాహ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా పరీవాహక ప్రాంతంలోని అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. నదీ తీరం వెంబడి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయటంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత కృష్ణమ్మ పరవళ్లు చూసి పరీవాహక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణమ్మ పరవళ్లు... ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

ఇదీ చూడండి: ఒక్కసారి తాగితే మళ్లీ అడుగుతారు

Intro:AP_RJY_56_13_PANTA NASTAM_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ ఎస్ వి కనికిరెడ్డి
కొత్తపేట

గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతించింది ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవడంతో గోదావరి వరద నీరు పోటెత్తడంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లంక ప్రాంతాలు నీటమునిగాయి. ప్రస్తుతం గోదావరికి వరద నీరు తగ్గడంతో లంక ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు

Body:కొత్తపేట నియోజక వర్గం లోని రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలాల్లోని సుమారు 35 గ్రామాల్లో ప్రజలు లంక ప్రాంతాల్లో పంటలు పండించి జీవనం సాగిస్తుంటారు వరద ప్రభావంతో వారు పండించిన పంటలన్నీ నీట మునిగి పదిరోజులపాటు నీటిలోనే ఉండడంతో పూర్తిగా కుళ్ళి పోయాయి.

Conclusion:ఒకపక్క పంటలు నీటిలో నానుతుండగా మరో పక్క ఎండ తీవ్రంగా కాయడంతో కూరగాయల పంటలు, పచ్చిమిర్చి దొండ పాదలు పూర్తిగా ఎండిపోయాయి. సంవత్సరం పాటు కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో వరద రూపంలో తాము నష్టపోయామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నేటి నుంచి నష్టాలను లెక్కించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.