ETV Bharat / state

సచివాలయం కూల్చివేతపై అధికారుల సమాలోచనలు - సచివాలయ భవనాల కూల్చివేత వార్తలు

సచివాలయ భవనాల కూల్చివేతపై రహదారులు-భవనాల మంత్రిత్వ శాఖ సమాలోచనలు చేస్తోంది. కరోనా నేపథ్యంలో భవనాలను ఇప్పుడే కూల్చేద్దామా, కొంతకాలం వేచి ఉండాలనే అంశంపై కసరత్తులు చేస్తోంది. మొత్తం స్థలం చతురస్రాకారంలోకి మార్చే యోచిస్తోంది. ఆ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసి ఆయన నుంచి వచ్చే సూచనల మేరకు ముందుకువెళ్లాలని భావిస్తున్నారు.

Secretariat Demolition
Secretariat Demolition
author img

By

Published : Jul 3, 2020, 8:59 AM IST

సచివాలయ భవనాల కూల్చివేతపై రహదారులు-భవనాల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భవనాలను ఇప్పుడే కూల్చేద్దామా, కొంతకాలం వేచి ఉండాలా? అని యోచిస్తోంది. సంప్రదాయ పద్ధతిలో కూల్చటమా? అత్యాధునిక ఇంప్లోజన్‌ విధానంలో చేపట్టడమా? అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు విధానాలపైనా ఒక నివేదికను రూపొందించాలని నిర్ణయించారు. రెండు విధానాల్లోని లాభ నష్టాలు, వ్యవధి తదితర వివరాలను అందులో పొందుపరుస్తారు. ఆ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసి ఆయన నుంచి వచ్చే సూచనల మేరకు ముందుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే వాహనాలు, కొన్ని భవనాల్లో మిగిలి ఉన్న ఇతరత్రా సామగ్రిని తరలిస్తున్నారు.

విద్యుత్తుశాఖ కార్యాలయాల తరలింపు

వాస్తుపరంగా ఉన్న లోటుపాట్లను చక్కదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంతకుముందే అధికారులకు స్పష్టంచేశారు. ఆ మేరకు సచివాలయ ప్రాంగణం మొత్తాన్ని చతురస్రాకారంగా తయారు చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఈ ప్రాంగణానికి వెనుక ఉన్న రాతి భవనం (స్టోన్‌ బిల్డింగ్‌)లోని విద్యుత్తు శాఖ కార్యాలయాలను తరలించారు. మింట్‌ కాంపౌండ్‌ వైపు కూడా కొంత స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల తేజ పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. మొత్తం స్థలాన్ని నలుచదరంగా మార్చేందుకు మూడు, నాలుగు నెలలు పడుతుందని అధికారుల అంచనా.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.