లాక్డౌన్ నేపథ్యంలో సొంతగూటికి చేరుకొనే మార్గం లేక వలస కూలీలు వందల మైళ్ల దూరం నడక సాగిస్తున్నారు. చెన్నై లాంటి తదితర ప్రాంతాల్లో చిక్కుకు పోయిన బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఆంధ్రప్రదేశ్ మీదుగా కాలి నడకన తమ ఊళ్లకు వెళ్తున్నారు. పని చేసిన చోట యజమానులు బతకడానికి నగదు ఇవ్వకపోగా వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడంతో వేరే దారి లేక నడక ప్రయాణం సాగిస్తున్నట్లు తెలిపారు.
పనులు లేక లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న వలస కూలీలు తప్పని పరిస్థితిల్లో కాలి నడకన సొంత గ్రామాలకు బయలుదేరమంటున్నారు. వీటికి తోడు షాపులన్నీ మూతపడటం రహదారి వెంబడి ఎలాంటి ఆహారం అందుబాటులో లేక అలమటిస్తున్నట్లు తెలిపారు.
ఇదీచూడండి: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్డౌన్పై కీలక చర్చ