భగవాన్ పుట్టపర్తి సత్యసాయి బాబా 9వ వర్ధంతి సందర్భంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, సత్యసాయి సేవ సమితి సభ్యులు ఫణిశంకర్, పల్లంరాజు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 125 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. సత్యసాయి సేవ సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సీపీ మహేశ్ భగవత్ అన్నారు. కరోనా వైరస్‌కు మందు లేదని ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రరణ పాటించాలన్నారు. కరోనాను తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు పోలీసులకు, అధికారులకు సహకారించాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి: హైదరాబాద్‌కు కేంద్ర బృందం- కరోనాపై క్షేత్రస్థాయి పరిశీలన