ETV Bharat / state

MLC Election Observers: ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకుల నియామకం - స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Election Observers)కు పరిశీలకులను నియమించారు. ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆదేశాలు జారీ చేసింది.

observers
ఎమ్మెల్సీ
author img

By

Published : Nov 24, 2021, 6:00 AM IST

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Election Observers)కు పరిశీలకులను నియమించారు. ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల వారీగా పరిశీలకులకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్‌కు నవీన్ మిత్తల్, వరంగల్‌కు శైలజా రామయ్యర్, నల్గొండకు అహ్మద్ నదీం పరిశీలకులుగా వ్యవహరిస్తారు.

మెదక్​కు వీరబ్రహ్మయ్య, నిజామాబాద్​కు అనితా రాజేంద్ర, ఖమ్మంకు సుదర్శన్ రెడ్డిని పరిశీలకులుగా నియమించారు. కరీంనగర్​కు విజయ కుమార్, మహబూబ్​నగర్​కు ఇ. శ్రీధర్, రంగారెడ్డికి చంపాలాల్ పరిశీలకులుగా ఉంటారు. 9 ఉమ్మడి జిల్లాకు చెందిన 12 స్థానాలకు ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు గడువు నిన్నటితో ముగిసింది. ఇవాళ పరిశీలన చేపట్టనున్నారు.

వచ్చే నెల పదో తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడడంతో పాటు ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు పరిశీలకులను నియమించారు.

ఇదీచూడండి: TS MLC elections 2021: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.