ETV Bharat / state

కంటోన్మెంట్​ను కైవసం చేసుకుంటాం : లక్ష్మణ్​

author img

By

Published : Jan 19, 2021, 7:17 PM IST

తెరాస నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జీహెచ్​ఎంసీలో భాజపా విజయాన్ని అడ్డుకోలేకపోయారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్​లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారాసిగూడలో మహంకాళి అధ్యక్షుడు శ్యామ్​సుందర్​గౌడ్​ నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

OBC Morcha National President Laxman comments on cm kcr
సమావేశంలో భాజపా నాయకులు

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో భాజపా కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ ధీమా వ్యక్తం చేశారు. తెరాస మంత్రులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గ్రేటర్​ ప్రజలు భాజపా వైపే ఉన్నారని తెలిపారు. సికింద్రాబాద్​ కంటోన్మెంట్​లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. వారాసిగూడలో మహంకాళి అధ్యక్షుడు శ్యామ్​సుందర్​గౌడ్​ నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జీహెచ్ఎంసీలో భాజపా గెలిచిన తర్వాత కూడా ఓడిపోయిన కార్పొరేటర్లు మంత్రుల వెంట తిరుగుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. గ్రేటర్​లో గెలిచిన వారి హక్కులను కాలరాస్తూ ప్రజల తీర్పును సీఎం అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్​ వనరులను దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్​ రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, భాజపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పిల్లల్ని పంపించటం పూర్తిగా తల్లిదండ్రుల నిర్ణయమే: సబిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.