ETV Bharat / state

'రిజర్వేషన్లు భిక్ష కాదు...  అది మా హక్కు' - OBC AIKYA VEDHIKA SADASSU IN HYDERABAD

బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో  హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. 'బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు' అనే అంశంపై చర్చించారు.

'బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు' అనే అంశంపై చర్చ

author img

By

Published : Feb 9, 2020, 7:00 AM IST

Updated : Feb 9, 2020, 7:39 AM IST

బీసీలకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు అగ్రకుల నాయకులే దండుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు' అనే అంశంపై సదస్సు నిర్వహించింది ఓబీసీ ఐక్యవేదిక. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయంగా రావాల్సిన వాటాకు భిన్నంగా నామమాత్రంగా సీట్లు కేటాయిస్తూ కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు.

'అన్ని రంగాల్లో మార్పు... బీసీల్లో మాత్రం నిల్'

సమాజంలో అన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నా... బీసీల స్థితిగతుల్లో మాత్రం మార్పు రాకపోవడం విచారకరమన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగడానికి చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టే వరకు రాజీలేని పోరాటం చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీసీలు జనాభా ప్రాతిపదికన తమ వాట సాధించడంతోపాటు ఉద్యోగ రంగంలోనూ రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.

60 రోజుల ప్రణాళిక...

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను చైతన్య పరచడానికి 60 రోజుల నిర్మాణాత్మక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ రాములు నాయక్ వివరించారు. రాష్ట్రంలోని 120 నియోజకవర్గాల్లో ఆరు రోజులపాటు పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్యతోపాటు మందకృష్ణ మాదిగ తదితర జాతీయ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగాలని స్పష్టం చేశారు. బీసీలు రాజకీయంగా ముందుకు రావాలని పలువురు బీసీ నేతలు పేర్కొన్నారు.

'బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు' అనే అంశంపై చర్చ

ఇవీ చూడండి : 'నా భార్యను ఆ నరకం నుంచి భారత్​కు రప్పించండి'

Last Updated : Feb 9, 2020, 7:39 AM IST

For All Latest Updates

TAGGED:

OBC MEETING
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.