ఎల్‌ఆర్‌ఎస్ పథకంపై వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌వీఎస్ ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని భూముల స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇప్పటికే భూ యాజమనులు, ఇంటి యాజమానుల నుంచి తెరాసకు చెందిన వ్యక్తులు టాక్స్‌లు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.
ఎల్‌ఆర్‌ఎస్ పథకం అనేది ముమ్మాటికి పేద, మధ్యతరగతి ప్రజలను దోపిడి చేయాడానికే అని ఆయన మండిపడ్డారు. భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని.. లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చించారు.
ఇదీ చూడండి : 'వాళ్లకే సాధ్యం కాలేదు.. మీతో ప్రాంతీయ పార్టీలు కూడా రావు'