అర్హత కలిగి ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న తమకు పోస్టింగులు ఇవ్వాలని నర్సింగ్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముందు నిరసన తెలిపారు.
2017లో 3,311 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని... అందులో ధృవపత్రాల పరిశీలన పూర్తయ్యాక 2,418 మందిని మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. మిగిలిన 893 మందికి అర్హత ఉన్నా... పోస్టింగులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తక్షణమే పోస్టింగులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నిరసనకు దిగిన నర్సింగ్ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: డబ్బులు ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం.. మాజీ ఎమ్మెల్యేపై కేసు