ETV Bharat / state

నాంపల్లిలో సందడిగా సాగుతున్న నుమాయిష్ - ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్​

Numaish Exhibition 2024 Hyderabad: పిల్లల నుంచి పెద్దల వరకు అందర్నీ అలరించే నుమాయిష్ హైదరాబాద్‌లోని నాంపల్లిలో సందడిగా సాగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్‌ను చూసేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 46 రోజులపాటు కొనసాగే నుమాయిష్‌లో ఈసారి దాదాపు రెండువేల స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఉత్పత్తులు, తినుబండారాలు, బొమ్మలు వంటివి ప్రదర్శనలో కొలువుదీరాయి. నుమాయిష్‌ను తిలకించేందుకు నగరవాసులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 4:00 PM IST

Numaish Exhibition in Nampally
Numaish Exhibition 2024 Hyderabad:
నాంపల్లిలో సందడిగా సాగుతున్న నుమాయిష్ - ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్​

Numaish Exhibition 2024 Hyderabad : హైదరాబాద్‌ నాంపల్లిలో ప్రతి ఏటా ఏర్పాటు చేసే నుమాయిష్ ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. 1938లో స్థానిక ఉత్పత్తులతో పాటు, చేతివృత్తులను ప్రదర్శించడానికి ఒక ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University) గ్రాడ్యుయేట్ల బృందం ఆలోచన చేసి నుమాయిష్‌గా అందుబాటులోకి తీసుకొచ్చాయి.

హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali khan) పాలనలో నుమాయిష్ ప్రదర్శనను కొనసాగించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో 1938లో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ప్రారంభంలో 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. తదనంతరం స్టాళ్ల సంఖ్య పెరగడంతో నుమాయిష్ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్చారు. దీనికి ప్రధాన కారణం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉండాలని నిర్వాహకులు భావించారు.

Numaish Exhibition in Nampally : ప్రారంభంలో ఎగ్జిబిషన్ పేరు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పిలుచుకునేవారు. 2009లో దాన్ని నుమాయిష్‌గా మార్చారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే నుమాయిష్‌కు రెండు సార్లు అటంకం కలిగింది. ప్రపంచ దేశాల్లో మరణ మృదంగం మోగించిన కోవిడ్(Covid-19) మహమ్మారి కారణంగా 2021-22 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం కోవిడ్​ను అరికట్టడంలో భాగంగా ఎగ్జిబిషన్‌ను రద్దు చేసింది.

అనంతం కరోన వైరస్ తగ్గడంతో ఎగ్జిబిషన్ సోసైటీ తిరిగి నుమాయిష్ ప్రారంభించింది. ఈ ఎడాది 83వ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేదీన ప్రారంభమైంది. 46 రోజులు పాటు నుమాయిష్‌ను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏడాది కోసారి జరిగే ఎగ్జిబిషన్‌కు ప్రజల నుంచి మంచి అనూహ్య స్పందన వస్తుంది.

నుమాయిష్​కి వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్​!​ మిస్​ కావొద్దు!

Nampally Numaish Exhibition 2024 : నగరంలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు, వారు వారి రాష్ట్రాలకు సంబంధించిన ఉత్పత్తులు, వస్తువులు కొనుగోలు చేసేందుకు కుటుంబసభ్యులతో సహా నుమాయిష్‌కు వస్తున్నారు. దీంతో ఇక్కడ నివసించే వివిధ రాష్ట్రాల వారు సైతం కుటుంబ సమేతంగా వచ్చి స్టాల్స్​లో ఉన్న ఉత్పతులను విక్షిస్తూ తమకు కావలసిన వస్తువులు కోనుగోలు చేస్తున్నారు.

నుమాయిష్ చాలా ఆహ్లాదరమైన వాతవరణం ఉందని, తమకు కావలసిన వస్తువులు అన్ని ఒకే చోట దొరకడం సంతోషంగా ఉందని నగర వాసులు అనందం వ్యక్తం చేస్తున్నారు. నుమాయిష్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎగ్జిబిషన్ సోసైటీ అన్ని ఏర్పాట్లు చేశారు.

షాపింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్ నుమాయిష్‌ ఎగ్జిబిషన్.. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే..?

ఉపాధి వెలుగులు.. నుమాయిష్‌లో ఆకట్టుకుంటున్న పీఎం-ఈజీపీ స్టాళ్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.