ETV Bharat / state

జీవో రాగానే నోటిఫికేషన్ విడుదల: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీ - ap news

ఈ ఏడాదికి సంబంధించిన వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ, స్లైడింగ్ విధానంపై ఉత్తర్వులు రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.

జీవో రాగానే నోటిఫికేషన్ విడుదల: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీ

author img

By

Published : Nov 6, 2020, 7:20 PM IST

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియకు ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నూతన ఫీజులకు సంబంధించిన జీవోను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఏవిధంగా జరపాలో ఉన్నత విద్యాశాఖ జీవో జారీ చేయాల్సిన అవసరం ఉందని వర్శిటీ ఉపకులపతి డా.శ్యామ్ ప్రసాద్ అన్నారు.

కౌన్సెలింగ్ ప్రక్రియ, స్లైడింగ్ విధానంపై ఉత్తర్వులు రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందని చెప్పారు. ఈనెల 15 లోపు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తవుతుందని వివరించారు. ఈ నెలాఖరులోగా కానీ... డిసెంబర్ మొదటి వారానికి విద్యార్ధుల ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

ఇదీ చదవండి: పటాన్​చెరులో సీఎం ఓఎస్​డీ ఆకస్మిక పర్యటన.. ధరణి పనితీరు పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.