ETV Bharat / state

అమెరికాలో జననం.. అష్టావధానంతో ప్రభంజనం - NRI BOY PERFECT IN ASTHAVADHANAM

అమెరికాలో పుట్టిపెరిగినా... మాతృభాషపై మమకారం వదలలేదు. తెలుగుభాషపై ఇష్టంతో టీవీల్లో ప్రవచనాలు విని ఇతిహాసాలపై మక్కువ పెంచుకున్నాడు. తెలుగు, సంస్కృత భాషల్లో అష్టావధానం చేసే స్థాయికి ఎదిగాడు. ఆ ప్రవాస భారతీయుడు ఎవరో? ఎలా చిన్న వయస్సులోనే ఎనిమిది అష్టావధానాలు పూర్తిచేశాడో? మనము తెలుసుకుందాం.

nri-boy-perfect-in-asthavadhanam
author img

By

Published : Aug 9, 2019, 5:11 AM IST

అమెరికాలోనే పుట్టాడు.. అక్కడే చదువుకున్నాడు... మాతృభాషపై మమకారం మాత్రం మరిచిపోలేదు. అతితక్కువ కాలంలోనే తల్లిదండ్రుల నుంచి భాష, గురువుల నుంచి పద్యాలు నేర్చుకుని ఏకసంథాగ్రాహిగా పేరొందాడు. తెలుగు, సంస్కృత భాషల్లో విశేష ప్రతిభ కనబరచడమే కాకుండా ఏకంగా అష్టావధానమే చేస్తున్నాడు. చిన్న వయసులోనే ఎనిమిది అష్టావధానాలు పూర్తిచేసి అందరిచేత శభాష్​ అనిపించుకున్నాడు ప్రవాస భారతీయుడు లలిత్.

అమెరికాలో జననం.. అష్టావధానంతో ప్రభంజనం

రెండు భాషల్లో పట్టు

హైదరాబాద్​కు చెందిన గన్నవరం లలిత్​ ఆదిత్య కుటుంబం రెండుతరాల కిందటే అమెరికాలో స్థిరపడింది. తల్లిదండ్రులు మారుతి శశిధర్​, శైలజ ప్రత్యేక శ్రద్ధతో లలిత్​కి తెలుగు, సంస్కృతం నేర్పించారు. చిన్ననాటి నుంచి ఆంగ్లమాధ్యమాల్లో చదివినా..తల్లిదండ్రుల చొరవ, ఆసక్తితో రెండు భాషల్లో పట్టు సాధించాడు. టీవీల్లో ప్రవచనాలు విని ఇతిహాసాలపై మక్కువ పెంచుకున్నాడు. మల్లాప్రగడ శ్రీనివాస్​, చిట్టాప్రగడ లలిత వద్ద సంస్కృత వ్యాకరణలనూ కంఠస్థం చేశాడు. దూళిపాళ్ల మహాదేవన్​ వద్ద అవధానంతో పాటు చందస్సులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఫోన్ ​ద్వారా రాజమండ్రి రాయప్రోలు కామేశ్వర శర్మ నుంచి సంధులు, సమాసాలు సహా చందశాస్త్రం నేర్చుకున్నాడు.

అతనోక యువశిరోమణి

అష్టావధానంతోనే ఆగలేదు లలిత్ పాండిత్యం. నారసింహానమశ్సతం, శారద పంచవింశికా, హనుమన్నవకం, నృసింహ పాదాది కేసరాంత స్తోత్రం పుస్తకాలను రచించాడు. అవధాన కిశోరం, అవధాన యువశిరోమణి బిరుదులు పొందాడు.

విదేశీ భాషలపై వ్యామోహంతో మాతృభాష, సంస్కృతులపై ఆసక్తి తగ్గుతున్న నేటి రోజుల్లో... లలిత్​ ఆదిత్య ఈ తరానికి స్ఫూరిగా నిలిచాడని..ప్రఖ్యాత అష్టావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్​ ప్రశంసించారు.

భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు

అమెరికాలో పుట్టి పెరిగినా... మాతృభాషపై మమకారం పెంచుకుని అష్టావధానం చేసే స్థాయికి ఎదగడంపై లలిత్​పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​ చదువుతున్న ఈ కళాతేజం...భవిష్యత్తులో ఈ రంగంలోనూ గొప్ప ఆవిష్కరణలు చేస్తానని చెబుతున్నాడు.

ఇదీ చూడండి: చిత్రకళలో ఔరా అనిపించిన అంధులు

Intro:jk_tg_nlg_212_04_beera_sagu_pkg_TS10117 కథనానికి సంబంధించిన మరికొన్ని విజువల్స్, బైట్స్ పంపించాను గమనించగలరు

Body:jk_tg_nlg_212_04_beera_sagu_pkg_TS10117 కథనానికి సంబంధించిన మరికొన్ని విజువల్స్, బైట్స్ పంపించాను గమనించగలరు

Conclusion:jk_tg_nlg_212_04_beera_sagu_pkg_TS10117 కథనానికి సంబంధించిన మరికొన్ని విజువల్స్, బైట్స్ పంపించాను గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.