ETV Bharat / state

NOTA Votes in Telangana Assembly Elections : ‘నోటా’తో మామూలుగా ఉండదు.. 2018 ఎన్నికల్లో ఆరుగురి తలరాత తలకిందులు - తెలంగాణ నోటా ఓటర్ల శాతం

NOTA Votes in Telangana Assembly Elections 2018 : నోటా.. ప్రతి ఓటరుకు ఉన్న ఆయుధం. ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి నచ్చకపోతే ఓటరు నోటాను ఎంచుకుంటారు. అది ఓటర్ల చేతిలో ఉన్న చాలా పవర్ ఫుల్ ఆయుధం. ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థుల తలరాతను తలకిందులుగా చేసే పాశుపతాస్త్రం. క్రితంసారి జరిగిన ఎన్నికల్లో 70 చోట్ల అయిదులోపు స్థానంతో నోటా సంచలనం రేపింది. మరోవైపు ఆరుగురి అభ్యర్థుల తలరాతను తలకిందులు చేసేసింది.

NOTA
NOTA In Telangana Assembly Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 25, 2023, 12:10 PM IST

NOTA Votes in Telangana Assembly Elections 2023 : ఎన్నికల బరిలోవున్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే.. ఓటర్లకు కనిపించే ఆయుధం నోటా (నన్​ ఆఫ్​ ది అబోవ్) (None Of The Above). అది ఓటర్లకు మామూలు ఆయుధం కాదు. ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థుల తలరాతను తలకిందులుగా చేసే పాశుపతాస్త్రం. 2018 జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆరుగురి భవిష్యత్తును మార్చింది ఈ నోటానే. ఆ ఆరుచోట్లు గెలిచిన ఆధిక్యం కన్నా.. నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2009లో ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిన నోటాను కేంద్రం ఆమోదించకపోవడంతో సుప్రీంకోర్టులో పిల్​ దాఖలైంది. ఈ క్రమంలో 2013లో నోటాను అమలు చేయాలనే తీర్పును వెల్లడించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాను వినియోగించారు.

భారత్​ భేరి : 'నోటా'తో నేతల గుండెల్లో దడ

  • క్రితంసారి శాసనసభ ఎన్నికలల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు 65,788 ఓట్లు సాధించి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్​ నేత కోవా లక్ష్మికి వచ్చిన ఓట్లు 65,617. అంటే కాంగ్రెస్​ అభ్యర్థయిన ఆత్రం సక్కు 171 ఓట్ల తేడాతోనే ఎన్నికల్లో గెలుపొందారు. కాగా ఈ నియోజకవర్గంలో నోటా(NOTA Votes in Telangana Elections 2018)కు పడిన ఓట్లు ఏకంగా 2,711.
  • ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్​కు 70,579 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అడ్లూరి లక్ష్మణ్​కుమార్ 70,138 ఓట్లు పొందారు. కొప్పుల ఈశ్వర్ 441 ఓట్లు ఆధిక్యంతో ఎన్నికల్లో గెలిచారు. ఇక్కడ ఐదో స్థానంలో నిలిచిన నోటాకు పడిన ఓట్లు 2,597.
  • ఇబ్రహీంపట్నంలో బీఆర్​ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్​రెడ్డికి లభించిన ఓట్ల ఆధిక్యం 376. ఆయనకు 72,581 ఓట్లు రాగా... సమీప బీఎస్పీ ప్రత్యర్థి మల్​రెడ్డి రంగారెడ్డికి 72,205 ఓట్లు లభించాయి. కాగా నోటాకు 1,145 ఓట్లు వచ్చాయి.

సీఎం కేసీఆర్ నోట ఆ 'పల్లె' ప్రగతి మాట.. భేష్ అంటూ..

  • అంబర్​పేటలో బీఆర్​ఎస్​ అభ్యర్థి కాలేరు వెంకటేశ్​కు 61,228 ఓట్లు వచ్చి ఎన్నికల్లో గెలుపొందగా.. సమీప ప్రత్యర్థి జి.కిషన్​రెడ్డికి 60,542 ఓట్లు లభించాయి. వెంకటేశ్​కు లభించిన ఓట్ల ఆధిక్యం 1,016. అంబర్​పేట్​లో నాలుగో స్థానంలో నిలిచిన నోటాకు 1,462 ఓట్లు వచ్చాయి.
  • కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్​కు 89,115 ఓట్లు వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప ప్రత్యర్థి నలమాడ పద్మావతిరెడ్డికి 88,359 ఓట్లు లభించాయి. 756 ఓట్ల తేడాతో మల్లయ్య యాదవ్ ఎన్నికల్లో గెలుపొందారు. కాగా ఇక్కడ నోటాకు లభించిన ఓట్లు 1,240
  • వైరా నియోజకవర్గంలో స్వతంత్ర లావుడ్యా రాములు 52,650 ఓట్లతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి బానోత్ మదన్​లాల్​కు 50,637 ఓట్లు లభించాయి. ఇక్కడ రాములుకు ఆధిక్యంగా వచ్చిన ఓట్లు 2013. ఇక్కట నోటాకు లభించిన ఓట్లు 2,360

NOTA Votes in Telangana Assembly Elections 2018 : తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో నోటా.. ఎక్కడా చివరి స్థానంలో నిలవలేదు. ఏకంగా 70 నియోజకవర్గాల్లో అయిదులోపే స్థానాలను దక్కించుకోవడం గమనార్హం. అప్పుడు రాష్ట్రంలో మొత్తం ఓట్ల సంఖ్య 2,56,94,443. ఎన్నికల్లో పోలైన ఓట్లు 2,04,70,749 (79.7%). నోటాకు మొత్తంగా 2,24,709 (1.1%) ఓట్లు లభించాయి.

క్రితంసారి జరిగిన ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకంటే వర్థన్నపేటలో అత్యధికంగా 5,842 ఓట్లు నోటాకు వచ్చాయి. అక్కడ నమోదైన ఓట్లలో నోటాకు ఏకంగా 3.09% కావడం గమనార్హం. హుజూరాబాద్​లో నోటాకు మూడో స్థానం. ఈటల రాజేందర్(బీఆర్ఎస్), పాడి కౌశిక్​రెడ్డి(కాంగ్రెస్) తర్వాత నోటాకే స్థానం. ఖమ్మం నియోజకవర్గంలోనూ పువ్వాడ అజయ్ (బీఆర్ఎస్), నామా నాగేశ్వరరావు(టీడీపీ)ల తర్వాత అధికంగా ఓట్లు వచ్చింది నోటాకే.

స్థిరంగా బీజేపీ ఓట్​బ్యాంక్​.. 4 శాతం పెరిగిన కాంగ్రెస్​ ఓట్​షేర్.. మరి నోటాకు ఎన్ని?

'నోటాకు మెజారిటీ వస్తే మళ్లీ ఎన్నిక!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.