ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోటీ 30లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోగా... 49వేల 552మంది అభ్యర్థులపై అసమ్మతి వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో 0.37శాతం నోటా గుర్తుకు వేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పంచాయతీ ఎన్నికల్లో నోటా తొలిసారిగా ఉనికిలోకి తెచ్చింది. ఎక్కడ కూడా అభ్యర్థి ఓట్ల కంటే నోటాకు ఎక్కువ పోల్ కాలేదు. లక్షా 52వేల 536 ఓట్లు చెల్లలేదు. అవగాహనా లోపంతో మొత్తం ఓట్లలో 1.16శాతం చెల్లకుండా పోయాయి.
నిర్వహణలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనందున, బ్యాలెట్‌ను ఎలా మడవాలో ముందుగా చెప్పకపోవడం, రెండు గుర్తుల మధ్యలో ముద్ర వేయడం వంటి తప్పిదాలతో ఓట్లు చెల్లకుండా పోతాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది. వీవీప్యాట్లు అందుబాటులోకి రాకుంటే మున్సిపల్ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పత్రాలనే వినియోగించనున్నారు.
చెల్లని ఓట్లకు చెక్ - ఎవరూ నచ్చలే...
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్యను తగ్గించేందుకు ఈసీ కసరత్తు మొదలుపెట్టింది. వీవీప్యాట్లు అందుబాటులోకి రాకపోతే మున్సిపల్ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పత్రాలనే వినియోగించనున్నారు.