ETV Bharat / state

గ్రామాల్లో ధరణికి డబుల్ ట్రబుల్.. తలలు పట్టుకుంటున్న అధికారులు

author img

By

Published : Oct 13, 2020, 7:16 AM IST

రాష్ట్రంలో ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే గ్రామాల్లో 52 శాతం... పట్టణాల్లో 35 శాతం నమోదు దాటింది. ఆసాంతం జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక ఆస్తికి రెండు నమోదులతో సమస్య ఏర్పడింది. ఉమ్మడి ఆస్తుల విషయంలోనూ ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.

non agricultural property enrollment process is going on Telangana
గ్రామాల్లో ఒక ఆస్తికి రెండు నమోదులతో సమస్య

తెలంగాణలో ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతమైంది. గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో 62.42 లక్షల ఆస్తులకుగాను ఇప్పటివరకు 33.03 లక్షల వివరాలు తీసుకున్నారు. రోజూ కనీసం 5 లక్షలకు పైగా ఆస్తులను పంచాయతీ కార్యదర్శులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆస్తుల నమోదు 52 శాతం దాటింది. పట్టణాల్లో దాదాపు 35 శాతంగా ఉంది. ఈనెల 20వ తేదీలోగా పట్టణాల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అత్యధిక సిబ్బందిని రంగంలోకి దించారు. ఈ ప్రక్రియ వేగవంతమయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిన్నారు.

కొన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి డబుల్‌ ఎంట్రీల సమస్యలు ఎదురవుతున్నాయి. గ్రామ పరిధిలో గృహాలను విక్రయించిన తరువాత, కొనుగోలు చేసిన వ్యక్తి చాలాచోట్ల మ్యుటేషన్‌ (రికార్డుల్లో పేరు బదలాయింపు) చేయించుకోలేదు. ఇప్పటి వరకు రికార్డుల్లో పాత యజమాని పేరు వస్తోంది. ఆ ఆస్తిపన్ను మదింపు నంబరుపై కొత్త యజమాని వివరాల నమోదుకు ధరణి సాఫ్ట్​వేర్‌ అంగీకరించడం లేదు. దీంతో కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట కొత్తగా నమోదు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో పాత యజమాని పేరిట, అదే ఆస్తి వివరాలను కొత్త యజమాని పేరిట నమోదు చేసినట్లు వస్తోంది. వీరిద్దరికీ పాస్‌పుస్తకాలు మంజూరైతే సమస్యలు తలెత్తే అవకాశముందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఇలా కొన్నిచోట్ల ఒకే ఆస్తి వివరాలు రెండుసార్లు ధరణిలో నమోదయ్యాయి. ఇలాంటి వాటిలో కొన్ని వివరాలను తొలగించేందుకు, సవరించేందుకు అవకాశం (ఎడిట్‌ ఆప్షన్‌) లేదు. సవరణకు అవకాశమివ్వకుంటే కొత్త సమస్యలు వస్తాయని పలువురు సిబ్బంది పేర్కొంటున్నారు.

వారసత్వ సమస్యలు

గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ. తండ్రి చనిపోయిన కుటుంబాల్లో చాలాచోట్ల ఉమ్మడి ఆస్తుల విభజన చేసుకోలేదు. ప్రస్తుతం ఆస్తుల నమోదు సమయంలో తండ్రి స్థానంలో యజమానిగా ఎవరి పేరు చేర్చాలని పంచాయతీ కార్యదర్శులు అడగడంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. ‘ధరణి’లో యజమాని, సంయుక్త యజమాని పేర్లు మాత్రమే ఉన్నాయి. తండ్రికి ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉంటే గొడవలు వస్తున్నాయి. సంయుక్త యజమాని స్థానంలో అర్హులైన మిగతా కుటుంబ సభ్యులకు స్థానం కల్పించాలని సిబ్బంది సూచిస్తున్నారు.

పట్టణాల్లోనూ రెట్టింపు సిబ్బంది

రాష్ట్రంలో పురపాలక పట్ణణాలు, నగరాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియకు సిబ్బందిని భారీగా పెంచారు. ఆదివారం నుంచి రెట్టింపు సిబ్బందిని వినియోగిస్తున్నారు. వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 2.10 లక్షలకు గాను సోమవారం నాటికి 50 వేల ఆస్తుల నమోదు పూర్తయింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 71 వేలకు 26 వేల ఆస్తులు.. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 74 వేల ఆస్తులకు 29 వేలు నమోదు చేశారు. మొదట్లో పురపాలికల్లో రెవెన్యూ విభాగానికి చెందిన సిబ్బందిని, వీఆర్వోలను ఆస్తుల నమోదుకు వినియోగించారు. ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో మున్సిపాలిటీల్లోని పూర్తి సిబ్బందిని.. తాజాగా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ సిబ్బందిని రంగంలోకి దించారు. మెప్మా ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీ సిబ్బందిని విధులకు ఉపయోగిస్తున్నారు.

నిలిచిన మీసేవ పోర్టల్‌ సేవలు

మీసేవ పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. రెండు రోజులుగా దీని ద్వారా నమోదుకు ప్రయత్నిస్తున్న వారికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో నమోదు వెబ్‌లింక్‌ను ఐటీశాఖ తొలగించింది. మరిన్ని సవరణలతో త్వరలో లింకును ఏర్పాటు చేస్తామని తెలిపింది.

20 జిల్లాల్లో 50 శాతానికి పైగా నమోదు

గ్రామాల్లో ఆస్తుల నమోదు బాధ్యతను పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం పెట్టింది. ఇప్పటికే 20 జిల్లాల్లో 50 శాతానికిపైగా ఆస్తుల నమోదు పూర్తయింది. నిజామాబాద్‌లో అత్యధికంగా ఒక్కో గ్రామంలో రోజుకు సగటున 74 ఆస్తుల నమోదు జరుగుతోంది. దాదాపు 10 జిల్లాల్లో సగటున 50కి పైగా ఆస్తుల వివరాలు యాప్‌లో పొందుపరిచారు. వనపర్తి జిల్లా అత్యధికంగా 69.28 శాతం పనితీరు కనబరిచింది. తరువాత మెదక్‌, జోగులాంబ గద్వాల, ఖమ్మం, ములుగు జిల్లాలు 60 శాతం ప్రగతి మార్కును దాటాయి. ఇప్పటివరకు 50 శాతం కన్నా తక్కువ నమోదవుతున్నవి 12 జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఆదిలాబాద్‌లో ఇప్పటి వరకు 40.62 శాతమే నమోదు పూర్తయి చివరి స్థానంలో ఉంది. గ్రామాల రికార్డుల్లో లేని కొత్త ఆస్తుల్ని గుర్తిస్తున్న కార్యదర్శులు వాటిని ‘ధరణి’లో చేర్చుతున్నారు. ఇంటి పన్ను పరిధిలోకి వచ్చేవాటికి అదనంగా మరో 10 లక్షల గృహాలు పోర్టల్‌లో నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాటిని ఆస్తి పన్ను పరిధిలోకి తెస్తున్నారు. గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తిస్తుండటంతో వాటిపై పన్ను విధించేందుకు వీలు కలుగుతోంది.

సాదాబైనామాలకు మరో అవకాశం

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ నెలాఖరు వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 2014 జూన్‌ 2వ తేదీకి ముందు తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన వాటికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం తెలిపింది. మీసేవ లేదా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు వీటి క్రమద్ధీకరణకు 11.19 లక్షల దరఖాస్తులు రాగా 6.18 లక్షల దరఖాస్తులను పరిష్కరించింది.

ఇదీ చూడండి: 'ఆదేశాలు సరే... మరి నిధుల మాటేమిటి..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.