హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పోరు బుధవారం హోరాహోరీగా సాగుతోంది. అధికార పార్టీ తరఫున గచ్చిబౌలి డివిజన్ నుంచి కొమ్మిశెట్టి సాయిబాబా నామినేషన్ వేయడానికి భారీ ఎత్తున ర్యాలీతో బయలుదేరారు. తెరాస మొదటి జాబితాలో పేరు లేకపోయినా రాగం నాగేందర్ యాదవ్ తుల్జా భవాని గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... అనంతరం భారీ ర్యాలీతో బయలుదేరారు.
ప్రధాన పార్టీల అభ్యర్థుల వరుస ర్యాలీలతో నామినేషన్ పర్వం మరింత ఊపందుకుంది. స్వతంత్రం అభ్యర్థులూ భారీ ఎత్తున తరలివస్తున్నారు.
ఇదీ చదవండి: దేశంలోనే సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం: కేటీఆర్