ETV Bharat / state

తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

author img

By

Published : Jul 4, 2020, 7:22 AM IST

తెలంగాణలో ఆకలి చావుల్లేవని హైకోర్టు పేర్కొంది. నిర్మాణ కార్మికులు ఆకలి చావుల బారిన పడ్డారన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

no hunger deaths in telangana says high court
తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

కరోనా నేపథ్యంలో తెలంగాణలో ఆకలి చావుల్లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. భవన నిర్మాణ కార్మికులతోపాటు ఇతర నిర్మాణ కార్మికులు ఆకలి చావుల బారిన పడ్డారన్న వాదనలో వాస్తవం లేదంది. మహబూబ్‌నగర్‌కు చెందిన భారత్‌ భవన, ఇతర నిర్మాణ కార్మికుల యూనియన్‌ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

కరోనా ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ రంగంలోని వారికి నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ద్వారా సాయం అందించాలని పిటిషనర్‌ కోరారు. మార్చి నుంచి మే వరకు నెలకు రూ.5 వేల చొప్పున రూ.15 వేలు చెల్లించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రతివాదులైన కేంద్ర హోంశాఖ, కార్మికశాఖ, రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, రాష్ట్ర భవన, నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: 'మహా'లో కరోనా రికార్డు.. ఒక్కరోజే 6వేలమందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.