హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్న తరుణంలో... ఆ జిల్లాల్లోని ఇళ్లలోకి పని మనుషులు, డెలివరీ బాయ్స్‌ను అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులిచ్చారు.
పని మనుషులు, డెలివరీ బాయ్స్ తదితరుల వల్ల రాకపోకలు పెరిగి వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని అరవింద్ కుమార్ అన్నారు. వారికి సైతం అది ప్రమాదమేనని చెప్పారు. తప్పనిసరి పరిస్థితులైతే జీహెచ్ఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్, ఇతర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల నుంచి నిరభ్యంతర పత్రాన్ని విధిగా పొందాలని తెలిపారు.
ఇవీ చూడండి: పాఠశాల విద్యార్థుల ఘర్షణ.. కర్రతో ఇద్దరిపై దాడి