ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అవిశ్వాసాల జోరు - పీఠాన్ని కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు - brs leaders Nizamabad

No confidence motion on BRS leaders : రాష్ట్రవ్యాప్తంగా అవిశ్వాసాల జోరు సాగుతోంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీలోనే అసమ్మతి కుంపటి రాజుకుంటుండగా హోదాలో ఉన్నవారికి పదవీగండం పొంచి ఉంది. ఇదే అదునుగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు పావులు చకచకా కదిపి రాజకీయాన్ని తమకు అనుకూలంగా తిప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల్లోనూ అవిశ్వాసాలు ఊపందుకున్నాయి.

No Confidence Notice to Yadadri Municipal Chairman
No confidence motion on BRS leaders
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 9:12 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అవిశ్వాసాల జోరు- ఇప్పటికే పలువురిపై అవిశ్వాస తీర్మానం

No confidence motion on BRS leaders : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి స్థానిక సంస్థల్లోనూ అవిశ్వాసాల అస్త్రం సంధిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ పండిత్ వినీతను సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టి గద్దెదించారు. ఇదే తరహాలో నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్‌పైనా అవిశ్వాసం పెట్టాలని బీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం కార్పొరేటర్లు(BRS Corporator) కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ నగర మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీకు చెందిన కార్పొరేటర్లే అవిశ్వాసానికి ప్రయత్నం చేస్తున్నారు. మేయర్‌ నీతూకిరణ్‌ భర్త దండు శేఖర్‌ అక్రమాలపై మొదటి నుంచీ బీఆర్ఎస్‌ కార్పొరేటర్లు అసంతృప్తితోనే ఉన్నారు. త్వరలోనే కలెక్టర్‌ను కలిసి అవిశ్వాసం నోటీసు ఇవ్వనున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపాలికల్లో రగడ - ఛైర్మన్‌లకు అవిశ్వాసం సెగ

No confidence motion on Telangana Leaders : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోని నిజామాబాద్‌లో బీఆర్ఎస్‌ ఓడిపోయి బీజేపీ విజయం సాధించింది. గెలిచిన తర్వాత మేయర్‌ పీఠంపై బీజేపీ(BJP) దృష్టి పెట్టినా మున్సిపల్‌ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడం, పోటీ చేసేందుకు అయ్యే వ్యయప్రయాసల గురించి తర్జన భర్జనతో కమలం పార్టీ వెనుకడుగు వేసింది. కామారెడ్డి బల్దియాను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్‌(Congress) దృష్టి పెట్టింది. తాజాగా రహస్య సమావేశాలు జరగడం చూస్తే కామారెడ్డి బల్దియా ఛైర్‌పర్సన్ జాహ్నవికి పదవీ గండం పొంచి ఉందన్న చర్చ సాగుతోంది.

No Confidence Notice to Yadadri Municipal Chairman : మాక్లూర్ మండల పరిషత్ చైర్మన్ ప్రభాకర్‌పై అవిశ్వాసానికి ప్రయత్నం సాగుతోంది. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌పైనా సభ్యులు సీఈవోకు నోటీసులు ఇచ్చారు. నిజామాబాద్ రూరల్‌లోనూ నలుగురు పీఏసీఎస్‌ చైర్మన్‌లపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ శంకరయ్యపైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ కలెక్టర్‌కి కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు అందజేశారు. అభివృద్ధిని విస్మరించి శంకరయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు, కౌన్సిలర్లకు అందుబాటులో ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్​ డీసీసీబీ ఛైర్మన్​పై అవిశ్వాసం..!

సొంత పార్టీ నేతలే ఫిర్యాదు : సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిషత్ అధ్యక్షురాలు కవితారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా సీఈవో సురేశ్‌ కుమార్‌కు రాజీనామా పత్రం అందజేశారు. ఎంపీపీ కవితారెడ్డి మండల పరిషత్ నిధులు పక్కదారి పట్టించినట్లు సొంత పార్టీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ ఎంపీటీసీలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆమెపై అవిశ్వాసం తీర్మానానికి డిమాండ్ చేశారు. 17న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఆమె రాజీనామా చేశారు.

పురపాలికల్లో మూడేళ్ల తర్వాతే అవిశ్వాసం

No confidence motion against Leaders : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ స్రవంతిపై బీఆర్‌ఎస్‌, బీజేపీకు చెందిన కౌన్సిలర్లు అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్‌కు అవిశ్వాస తీర్మాన ప్రతులు అందజేశారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్‌ఎస్‌కు చెందిన 15 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు చెందిన ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్రవంతి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

బెల్లంపల్లి పురపాలికలో అవిశ్వాసం రగడ - హీటెక్కిస్తున్న క్యాంపు రాజకీయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.