Royals Meet: నిజాం నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం VII మనవడు నవాబ్ మీర్ నజాఫ్ అలీ ఖాన్ ఇవాళ మైసూర్ ప్యాలెస్‌లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్‌తో భేటీ అయ్యారు. నిజాం, వడయార్ వంశస్థులు సుమారు (మూడు తరాలు) వంద సంవత్సరాల తర్వాత రెండు రాయల్స్ కుటుంబాలకు చెందిన వారసులు మళ్లీ ఇవాళ కలిశారు.
నిజాం రాజుల కీర్తిప్రతిష్టలను వడయార్ కొనియాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఇతర సంస్థానాల మహరాజుల ప్రయోజనాలను రక్షించడంలో నిజాం ప్రభువులు గొప్పపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. 1965లో భారతదేశం-చైనా యుద్ధం సమయంలో ఆసఫ్ జాహీల పాత్రను కృష్టదత్త పొగిడారు. ఆ సమయంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దేశానికి మద్దతుగా 5,000 కిలోల బంగారాన్ని అందించారని తెలిపారు.
మైసూర్ ప్యాలెస్‌లో చాలా ముఖ్యమైన భాగాన్ని నిర్మించడంలో నిజాం సాయం చేశారని పేర్కొన్నారు. దీంతో పాటుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.. బెంగుళూరుకు అనేక సంవత్సరాల పాటు భారీ మొత్తాలతో మద్దతుగా నిలిచారని వివరించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చదువుతున్న విద్యార్థులకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. ఇరు రాజవంశాల వారసులు దేశంలో మాజీ పాలకుల వారసుల కోసం ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి వీరు ఆసక్తి కనబర్చారు.
ఇదీ చూడండి : కేసీఆర్ ప్రధాని కావాలని మొక్కుకున్నా: మంత్రి మల్లారెడ్డి