ETV Bharat / state

'కొవిడ్​ నియంత్రణకు వ్యాక్సిన్​ను త్వరలోనే తీసుకొస్తాం' - త్వరలోనే కొవిడ్​ వ్యాక్సిన్​ను తీసుకొస్తామన్న నైపర్ హైదరాబాద్

కొవిడ్​-19 వ్యాక్సిన్​కు క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్నాయని నేషనల్​ ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫార్మాస్యూటికల్ ఎడ్యూకేషన్(నైపర్​)​ డైరెక్టర్ డా.శశిబాల సింగ్ హైదరాబాద్​ బాలానగర్​లోని నైపర్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో​ అన్నారు.

niper hyderabad pressmeet on covid vaccine
'కొవిడ్​ నియంత్రణకు వ్యాక్సిన్​ను త్వరలోనే తీసుకొస్తాం'
author img

By

Published : Sep 11, 2020, 10:45 PM IST

హైదరాబాద్​ బాలానగర్​లోని నేషనల్​ ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫార్మాస్యూటికల్ ఎడ్యూకేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు సమావేశం నిర్వహించారు. కొవిడ్​ వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ నడుస్తున్నాయని నైపర్​ డైరెక్టర్​ డా.శశిబాల సింగ్ వెల్లడించారు.

ఈ మందు కరోనా సోకిన వ్యక్తులకు వ్యాధి నుంచి నివారించేందుకు ఉపయోగపడుతుందని.. మరో రెండు మూడు నెలల్లోనే దీనిని మార్కెట్​లో విడుదల చేస్తామని శశిబాల ఆశాభావం వ్యక్తం చేశారు. టీకా ద్వారా ఎవరికీ.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవి పేర్కొన్నారు.

సమాజ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని.. వైరస్​ అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నంగా మందును కనిపెడుతున్నామని సుప్రీం పరిశ్రమ ఎండీ, డాక్టర్​ కేశవ్​దేవ్ తెలిపారు. అందరి సమష్టి కృషితో నాణ్యతతో కూడిన వ్యాక్సిన్​ను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.