నిమ్స్ ప్రొఫెసర్ మీనాకుమారి లండన్‌లో శుక్రవారం కన్నుమూశారు. అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనడానికి లండన్ వెళ్లిన నిమ్స్ సీనియర్ ఫిజీషియన్ మీనా కుమారి.. సదస్సులో ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలారు. అత్యంత విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరిన ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్ల ఆమె కన్నుమూశారు.
ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేసిన యూకే డిప్యూటీ హై కమిషనర్ డా.ఆండ్రూ ఫ్లెమింగ్ ఆమె కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ అనూహ్య ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, నిమ్స్ వైద్యులు, ఆసుపత్రి సిబ‍్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
మీనాకుమారి నిమ్స్ ఆస్పత్రి న్యూరో విభాగంలో సీనియర్ ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె నిమ్స్‌లో 25 ఏళ్లుగా సేవలందించి.. ప్రత్యేక గుర్తింపును సాధించారు.
ఇదీ చూడండి : కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్