ETV Bharat / state

అత్యంత విషమంగా పీజీ వైద్య వైద్యార్థిని ఆరోగ్యం.. ఎక్మో సపోర్ట్​తో చికిత్స - అత్యంత విషమంగా పీజీ వైద్య వైద్యార్థిని ఆరోగ్యం

PG Medical Student Health Bulletin Update: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్‌ కేఎంసీ పీజీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందన్న వైద్యులు.. ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధింపుల వల్లే తన కుమార్తెకు ఈ దుస్థితి వచ్చిందని ఆమె తండ్రి ఆరోపించారు. కళాశాలలో అసలు ర్యాగింగే జరగలేదని... రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు రమేష్‌రెడ్డి స్పష్టం చేశారు.

medical student
medical student
author img

By

Published : Feb 23, 2023, 7:41 PM IST

Updated : Feb 24, 2023, 7:34 AM IST

PG Medical Student Health Bulletin Update: పీజీ వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని నిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. వైద్య విద్యార్థిని కొన్ని అవయవాలు సరిగా పనిచేయడం లేదన్న ఆయన.. ఆర్​ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం విద్యార్థిని చికిత్సను పర్యవేక్షిస్తుందని సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు.

ఫోన్ తనిఖీ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి: వరంగల్ కేఎంసీలో ఆత్మహత్యాయత్నానికి యత్నించిన విద్యార్ధినికి నిమ్స్​లో చికిత్స కొనసాగుతోంది. ఆమె బీపీ, షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదన్నారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని... ఎక్మో సపోర్ట్​తో చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే చివరి ప్రయత్నం అని వైద్యులు వెల్లడించారని ఆమె తండ్రి తెలిపారు. వైద్యులు ఆమెకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారన్నారు.

కేఎంసీలో ర్యాగింగ్ జరగలేదు : వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఎటువంటి ర్యాగింగ్ జరగలేదని... రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాగ్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు, సైఫ్‌ మధ్య మనస్పర్థలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని.. వెంటిలేటర్​పై విద్యార్థినికి చికిత్స కొనసాగుతోందని రమేశ్​రెడ్డి తెలిపారు. కేఎంసీలో ర్యాగింగ్ జరగలేదన్నారు. దీనిపై ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీ వేశామని రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని రమేశ్‌రెడ్డి వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్‌ వైద్యులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.

అయితే రమేశ్ రెడ్డి ప్రకటనను విద్యార్థిని తండ్రి ఖండించారు. తన కూతురి ఫోన్ తనిఖీ చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని... ర్యాగింగ్ జరగలేదని వైద్యవిద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి చెప్పడం... ఘటనను తప్పుదారి పట్టించడమేనని ఆరోపించారు. ర్యాగింగ్ వల్లనే తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆయన తెలిపారు. ఘటన జరిగినపుడు ఇద్దరికీ కలిపి కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ తమ కుమార్తెకు మాత్రమే ఎందుకు ఇచ్చారన్నారు. కౌన్సిలింగ్ విషయమే తన కుమార్తె చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కారకులను కఠినంగా శిక్షించాలి : ఈ ఘటనపై వరంగల్, హైదరాబాద్‌లో ఏబీవీపీ, బజరంగ్‌దళ్‌ సహా గిరిజన సంఘాలు, బీఎస్పీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మహత్యయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితిలోనూ కేఎంసీలో అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చర్యలు తీసుకుని బాధితురాలికి మెరుగైన చికిత్స అందించకపోతే కేఎంసీ ముట్టడిస్తామన్నారు. మరోవైపు సామాజిక కార్యకర్త ఇందిరా శోభన్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కనీసం సత్యవతి రాథోడ్ కూడా స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. వరంగల్‌ కమిషనర్, డీజీపీ, కళాశాల యాజమాన్యంపై మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 24, 2023, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.