ETV Bharat / state

NIMS Doctor scam: నిమ్స్‌ ఆస్పత్రిలో సరికొత్త దందా... పరీక్ష పాసైతేనే..శస్త్రచికిత్స! - హైదరాబాద్​ వార్తలు

నిమ్స్‌ ఆస్పత్రిలో సరికొత్త దందా కొనసాగుతోంది. ప్రైవేటు ల్యాబ్‌లతో కొంతమంది వైద్యులు కుమ్మక్కైన వ్యవహారం పరిశీలనలో వెలుగులోకి వచ్చింది (NIMS Doctor scam). రోగులను ప్రైవేటు ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు చేయించుకోమని కొంతమంది వైద్యులు ఒత్తిడి తేవడం చర్చనీయాంశమైంది. కొంతమంది వైద్యులు నిజాయతీగా నిమ్స్‌లోనే పరీక్షలు చేయించి పూర్తిస్థాయి వైద్యం చేస్తుండగా కొందరు మాత్రం పక్కదారిపట్టడం పట్ల రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

nims hospital
nims hospital
author img

By

Published : Oct 31, 2021, 1:35 PM IST

కరీంనగర్‌కు చెందిన ఒక రోగి కొద్దిరోజులక్రితం కిడ్నీ, ఇతరత్రా ఇబ్బందులతో నెఫ్రాలజీ విభాగంలో చేరారు. ఆయనకు పలు రకాల పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారు. ఇవన్నీ కూడా నిమ్స్‌లో ఉదయం చేయిస్తే సాయంత్రానికి వస్తాయి. వైద్యుడి పరీక్షలు చేయించాలని సూచించిన పది నిమిషాల్లోనే రోగి పడక దగ్గరకు ప్రైవేటు ల్యాబ్‌ ప్రతినిధి వచ్చాడు. పరీక్షలన్నీ మేం చేస్తాం.. ఇంత ఖర్చవుతుందంటూ చెప్పాడు. లేదు ఆస్పత్రిలోనే చేయించాకుంటానని చెప్పగా మాకు వైద్యుల నుంచి తోడ్పాటు లభించలేదని రోగి బంధువులు చెప్పారు.

నిమ్స్‌ ఆస్పత్రిలో సరికొత్త దందా కొనసాగుతోంది (NIMS Doctor scam). ప్రైవేటు ల్యాబ్‌లతో కొంతమంది వైద్యులు కుమ్మక్కైన వ్యవహారం పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. వందల కిలో మీటర్ల దూరం నుంచి వచ్చిన రోగులను ప్రైవేటు ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు చేయించుకోమని కొంతమంది వైద్యులు ఒత్తిడి తేవడం చర్చనీయాంశమైంది. ఆ ల్యాబ్‌ల నుంచి పరీక్షా నివేదికలు వస్తేనే శస్త్రచికిత్సలు చేస్తామని వైద్యులు హెచ్చరిస్తుండటంతో రోగుల బంధువుల ఆందోళన చెందుతున్నారు. కమీషన్ల కక్కుర్తితోనే ఈ మొత్తం తంతు జరుగుతోందని అనేకమంది చెబుతున్నారు. కొంతమంది వైద్యులు నిజాయతీగా నిమ్స్‌లోనే పరీక్షలు చేయించి పూర్తిస్థాయి వైద్యం చేస్తుండగా కొందరు మాత్రం పక్కదారిపట్టడం పట్ల రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏకంగా విభాగాల వద్దే ఏజెంట్ల తిష్ఠ
నిమ్స్‌ వైద్యులతో సంబంధం ఉన్న ప్రైవేటు ల్యాబ్‌లకు సంబంధించిన ఏజెంట్లు కొన్ని విభాగాల్లో తిరుగుతున్నారు. శస్త్ర చికిత్స చేసే రోగిని సంబంధిత వైద్యుడు పరీక్షించి వెంటనే దాదాపు రూ.10 వేల నుంచి రూ.15 వేల ఖరీదయ్యే పరీక్షల జాబితాను ఇస్తున్నారు. ఇవి ఇక్కడైతే ఆలస్యమవుతుంది ఫలానా ల్యాబ్‌లో చేయించుకోండని సలహా ఇస్తారు. డాక్టర్‌ చెప్పినట్లు వింటే శస్త్ర చికిత్స తొందరగా అవుతుందని పేదలు అప్పు చేసి మరీ పరీక్షలు చేయించుకుంటున్నారు. గాంధీలో కూడా ఇదే తంతు జరుగుతోందని రోగులు చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటాం
అత్యవసరమైతేనే కొంతమంది రోగులు బయట పరీక్షలు చేయించుకుంటున్నారు తప్ప ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదు. కొన్ని విభాగాల్లో నిజంగా ఒత్తిడి తెస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. రోగులు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తే దీనికి అనుగుణంగా చర్యలుంటాయి. - ఆస్పత్రి వర్గాలు.

ఇదీ చూడండి: Child_Death: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. నీలోఫర్​లో బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.